Guntur Kaaram: ఈవెంట్ కన్ఫ్యూజన్ , ట్రైలర్ కన్ఫర్మేషన్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గుంటూరు కారం”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ భారీ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ లో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. కల్ట్ క్లాసిక్స్ అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడవ మూవీ ఇది. ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులలో హుషారెత్తించే న్యూస్ ఒకటి ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ కు సంబంధించిన వార్త వైరల్ అవుతుంది.

భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా రాబోతున్న “గుంటూరు కారం” మూవీకి సంబంధించిన ప్రమోషన్లలో ప్రస్తుతం టీం బిజీగా ఉంది. జనవరి 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్లాన్ చేశారు. కానీ అనుకొని విధంగా ఈవెంట్ కు అడ్డంకులు ఏర్పడ్డాయి. అక్కడ ఈవెంట్ ను నిర్వహించడానికి పర్మిషన్ దొరకకపోవడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిలిం వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం జనవరి 7న కూడా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగట్లేదు. జనవరి 7న ఇప్పటికే “హనుమాన్” మూవీ ఈవెంట్ జరుగుతుండడంతో మేకర్స్ తమ ప్లాన్ మార్చుకున్నట్టు సమాచారం.

జనవరి 8న, లేదా 9న అయినా సరే ఈవెంట్ ను నిర్వహించడానికి పర్మిషన్ కోసం ట్రై చేస్తున్నారట ఆర్గనైజర్స్. అయితే ఈ ఈవెంట్ లోనే “గుంటూరు కారం” మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారనే వార్త రావడంతో మహేష్ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం జనవరి 7న ఈ మూవీ ఈవెంట్ జరిగినా, జరగకపోయినా ట్రైలర్ మాత్రం పక్కాగా రిలీజ్ కాబోతోందనీ ప్రచారం జరుగుతోంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే ట్రైలర్ వర్క్ మొత్తం పూర్తి కాగా, ఈవెంట్ లోనే డైరెక్ట్ గా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. కాబట్టి “గుంటూరు కారం” ట్రైలర్ కోసం ఈవెంట్ అయ్యేదాకా ఎదురుచూడాల్సిందే.

- Advertisement -

ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోతే ట్రైలర్ తోనే మహేష్ అభిమానులు సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. మూవీ రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్ మాత్రం జరగనుందని సమాచారం. కాగా ఇటీవల కాలంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటివి లేకుండానే మూవీని డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రభాస్ “సలార్” విషయంలో కూడా ఇలాగే జరిగింది. అయితే “గుంటూరు కారం” మూవీకి మాత్రం భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అసలు “గుంటూరు కారం” ఈవెంట్ జరుగుతుందా? లేకపోతే ఈవెంట్ లేకుండానే డైరెక్ట్ గా మూవీని రిలీజ్ చేస్తారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

గతంలో మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన “ఖలేజా” మూవీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఎలాంటి ఈవెంట్ లేకుండానే డైరెక్ట్ గా సిడిల రూపంలో పాటలను మార్కెట్లోకి వదిలారు. ఏదైతేనేం ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రైలర్ రిలీజ్ అయితే “గుంటూరు కారం” మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు