Guntur Kaaram: పొలిటికల్ ఎఫెక్ట్… త్రివిక్రమ్ వల్లే ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా?

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి రిలీజ్ కాబోతున్న సినిమాల్లో అతిపెద్ద సినిమా గుంటూరు కారం. ఈ సినిమా కోసం ఫ్యాన్సే కాదు కామన్ ఆడియన్స్ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో లో పదమూడేళ్ల తర్వాత హ్యాట్రిక్ కాంబో గా వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పాన్ ఇండియా సినిమాలకు ఏమాత్రం తగ్గనట్టు ఉంది.

ఇదిలా ఉండగా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న లేదా 7న యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో గ్రాండ్ గా నిర్వహిద్దామని ప్లాన్ చేసారు. కానీ అనూహ్యంగా కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల గుంటూరుకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. అయితే అసలు కారణం మాత్రం వేరొకటి ఉందని ట్రేడ్ విశ్లేషకుల నుండి సమాచారం. తెలంగాణ లో కొత్త గవర్నమెంట్ వచ్చాక టాలీవుడ్ ప్రముఖులు, సెలెబ్రిటీలు వెళ్లి గౌరవ ముఖ్యమంత్రిని కలవడం ఇండస్ట్రీ మంచి చెడ్డల గురించి మాట్లాడడం జరిగింది. కానీ ఇంత పెద్ద డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ గాని, మూవీ మేకర్స్ గాని సినిమా రిలీజ్ ధ్యాస లో ఇవన్నీ పట్టించుకోవడం మానేశారు.

ముఖ్యంగా సినీ పరిశ్రమ తరఫునుండి కనీసం సినిమాటోగ్రఫీ మినిస్టర్ ని అయినా కలవడం ఆనవాయితీ. అయితే ఇండస్ట్రీ లో బడా డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ రాజకీయాల్లో లేకపోయినా, గత ప్రభుత్వ ప్రతినిధులతో సన్నిహితంగా ఉండడం వల్ల, పైగా ఈ మూవీ నిర్మాతలు కూడా పలానా ప్రముఖులకు క్లోజ్ అవడం వల్ల కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అడ్డు రావడం కారణం కావచ్చు అని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది.

- Advertisement -

అయితే ఈ కారణం వల్లే ఈవెంట్ కి పర్మిషన్ దొరకలేదని చెప్పలేము. ప్రస్తుతం ఎలక్షన్ల హడావిడి ఉన్నందున, గుంటూరు కారంలో కొన్ని పొలిటికల్ హీట్ ఎక్కించే సన్నివేశాలు కూడా ఉన్నాయని టాక్ నడుస్తుంది. అందువల్ల ఈ సినిమా రిలీజ్ పై తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా ప్రభావం ఉంటుందా అన్న డౌట్ ఉంది. ఏది ఏమైనా గుంటూరు కారం సినిమాకి యూసుఫ్ గూడా లో పర్మిషన్ ఇవ్వకపోతే, కూకట్ పల్లి గ్రౌండ్స్ లో అయినా నిర్వహిద్దామని మేకర్స్ ట్రై చేస్తున్నారు. ఇది కూడా వర్కౌట్ అవ్వకపోతే ఆంధ్ర వైజాగ్ బీచ్ ఉండనే ఉంది. ఇక గుంటూరు కారం సినిమా ట్రైలర్ కూడా ఈవెంట్ లోనే రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు