Sivaji : ఇంత కన్నా పెద్ద కంప్లిమెంట్ ఉంటుందా…

టాలీవుడ్ నటుడు శివాజీ బిగ్ బాస్ తరువాత మళ్ళీ బిజీ అయిపోయాడు. 20స్ చాలా బిజీ హీరో అయిన శివాజీ ఆ తర్వాత ఆఫర్లు తగ్గడంతో గత పదేళ్లుగా పెద్దగా సినిమాలు చేయలేదు. ఇక కొన్నేళ్ల పాటు రాజకీయాల్లో ఏదో ట్రై చేద్దామని వెళ్లి అక్కడ ఫెయిల్ అవడంతో పాటు కొన్ని విమర్శల్ని కూడా మూటగట్టుకున్నాడు. అయితే రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 7 లో ఎంట్రీ ఇచ్చి మళ్ళీ జనాల్లో పాపులారిటీ సంపాదించగా, ఆల్మోస్ట్ కప్ కి చాలా దగ్గరగా వెళ్లి టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచాడు.

ఇక బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక శివాజీ వరుస ఇంటర్వ్యూ లు ఇస్తూ మళ్ళీ బిజీ అవగా, రీసెంట్ గా ఆయన నటించిన 90స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెబ్ సిరీస్ ప్రమోషన్లో పాల్గొంటూ బిజీ అయ్యాడు. ఇక ఈ సందర్బంగా శివాజీ ఓ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత తన లైఫ్ కి మళ్ళీ కొత్త ఊపు వచ్చిందని, ముందున్న దానికన్నా డబల్ ఫేమ్ సంపాదించానని అన్నాడు. ఇక బిగ్ బాస్ షో లో తన ఆట గురించి ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తనని ప్రశంసిస్తూ అభినందనలు తెలియచేస్తున్నారన్నాడు. ఇక నాగార్జున అయితే బిగ్ బాస్ అన్ని సీజన్ల లో ఇప్పటివరకు తాను ఆడినంత మైండ్ గేమ్ ఇంకెవర్ని చూడలేదన్నారు. అందుకే ఆయన చాణక్య అన్నాడు.

అయితే శివాజీ కి అందరికన్నా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చిన వ్యక్తి ఒకరు ఉన్నాడు. ఆయనెవరోకాదు మెగాస్టార్ చిరంజీవి.. ఈ విషయాన్నీ శివాజి తెలుపుతూ.. తాను రీసెంట్ గా నటించిన 90స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం “వెంకీ75” ఈవెంట్ కి వెళ్లాడని, అక్కడ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ని కలిశానని అన్నాడు. అయితే అక్కడ అనుకోకుండా అన్నయ్య చిరంజీవే తన బిగ్ బాస్ షో గురించి ప్రస్తావించాడు అన్నాడు. చిరంజీవి మాట్లాడుతూ శివాజీ బిగ్ బాస్ షో చూసామయ్యా.. చాలా బాగా ఆడావు.. నీకోసమే ఆ షో చూసాం శభాష్ అని మెచ్చుకున్నారు అని చిరంజీవి అన్నట్టు శివాజీ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ఇక లైఫ్ లో ఇంతకన్నా పెద్ద కాంప్లిమెంట్ ఉంటుందా అని శివాజీ అన్నాడు. అలాగే చిరంజీవి గారితోనే తన ఫస్ట్ సినిమా “మాస్టర్” చేసానని, అప్పుడు తన పెర్ఫార్మన్స్ కి మెచ్చి అల్లు అరవింద్ తో ఎక్కువ డబ్బులు ఇప్పించారని గుర్తుచేసుకున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు