Hanuman: “హనుమాన్”లో మెగా హీరో?

Hanuman: టాలీవుడ్ లో రాబోతున్న మొట్టమొదటి సూపర్ హీరో మూవీ “హనుమాన్”. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మేకర్ స్ ఇప్పటిదాకా ప్రేక్షకులను సస్పెన్స్ లో ఉంచిన మెగా ట్విస్ట్ రివీల్ అయ్యింది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? “హనుమాన్” మూవీలో మెగా హీరో స్పెషల్ రోల్ లో కనిపించి సర్ప్రైజ్ చేయబోతున్నాడా? అనే వివరాల్లోకి వెళితే…

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ, హీరోయిన్ అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న టాలీవుడ్ ఫస్ట్ సూపర్ హీరో మూవీ “హనుమాన్”. అన్ని భారతీయ భాషల్లోనూ పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం “హనుమాన్” ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండడంతో పాటు, హాలీవుడ్ రేంజ్ లో ఉన్న విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఇక ట్రైలర్ తోనే స్టోరీ అంతా చెప్పేసాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. కానీ ఒకే ఒక్క సస్పెన్స్ మాత్రం క్రియేట్ చేశాడు.

ఒక గ్రామీణ యువకుడికి హనుమాన్ పవర్ ఇచ్చి అండదండగా నిలుస్తాడు. అలాగే ఏదో ప్రత్యేకమైన పవర్ కోసం వెంపర్లాడుతూ హీరో విలేజ్ పైన దాడికి ప్రయత్నించే విలన్ల పని పట్టడానికి సాయం చేస్తాడు. కానీ ఒకానొక సమయంలో ఏకంగా హనుమాన్ దిగిరాక తప్పదు. ఇక్కడ విలన్ ఏ పవర్ కోసం అంతగా పరితపిస్తున్నాడు? ఇంతకీ హనుమాన్ అతన్ని ఎలా అంతం చేయబోతున్నాడు? అనే డౌట్స్ ట్రైలర్ ను చూశాక ఆసక్తిని రేకెత్తించాయి. అలాగే అసలు ఇందులో “హనుమాన్” పాత్రను ఎవరు పోషిస్తున్నారు? ఇంతకీ హనుమాన్ ఉంటాడా? లేదంటే కేవలం వెనక ఉండి నడిపించే అదృశ్య శక్తిగా ఆయనను చూపించబోతున్నారా? అనే అనుమానాలు కూడా కలిగాయి.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే “హనుమాన్” మూవీలో ఓ మెగా హీరో కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. దానికి కారణం లేకపోలేదు. ట్రైలర్ లో హనుమంతుడి కళ్ళను చూస్తే మెగాస్టార్ చిరంజీవి అని ఎవరైనా ఇట్టే గుర్తుపడతారు. కాబట్టి ఈ సినిమాలో “హనుమాన్” పాత్రను మెగాస్టార్ పోషించబోతున్నాడు అని అనిపిస్తోంది. ఇదే విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ముందు పెట్టగా ఆయన కాదు అని సమాధానం అయితే చెప్పలేదు గానీ, ఆ సర్ప్రైజ్ ను సినిమాలోనే చూడాలి అంటూ సమాధానాన్ని దాటవేశారు.

దీంతో ఎలాగూ మెగాస్టార్ ఆంజనేయస్వామి భక్తుడు. గతంలో “హనుమాన్” అనే యానిమేటెడ్ మూవీకి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. కాబట్టి “హనుమాన్” మూవీలో ఆంజనేయ స్వామి పాత్రలో చిరంజీవి కనిపిస్తాడని, లేదంటే ఆయన యానిమేటెడ్ వీడియోను వాడతారని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఎదురు చూడక తప్పదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు