Hanuman: హనుమాన్ కు “ఆదిపురుష్” అండ?

Hanuman: టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ “హనుమాన్”. అన్ని భాషల్లో సంక్రాంతి కానుకగా రాబోతున్న “హనుమాన్” ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్టుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించేశారు. మరి “హనుమాన్” కోసం “ఆదిపురుష్” దిగిరాబోతున్నాడా? ఈ హనుమాన్ కు ఆ ఆది పురుష్ అండగా నిలవబోతున్నాడా? అనే వివరాల్లోకి వెళితే…

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న తాజా సూపర్ హీరో మూవీ “హనుమాన్” భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని స్ఫూర్తితో రూపొందింది. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఫస్ట్ సూపర్ హీరో సిరీస్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించాయి. హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ ఉండడంతో ఈ సినిమా ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న “హనుమాన్” ప్రమోషనల్ ఈవెంట్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ వేదికగా జనవరి 7న “హనుమాన్” మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వెల్లడించారు. అయితే ఈ ఈవెంట్ కు గెస్ట్ గా “ఆది పురుష్” రాబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాత్రం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 7న జరగబోతుందని ఇప్పటికే ప్రభాస్ కు ఇన్ఫామ్ చేసాం. మరి ఆయన ఈ ఈవెంట్ కు ఎలా హెల్ప్ చేస్తారు అన్నది చూడాలి అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో “హనుమాన్” మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ గెస్ట్ గా రాబోతున్నాడు అనే విషయం అర్థమవుతుంది.

- Advertisement -

కానీ ప్రభాస్ ఈవెంట్ కు గెస్ట్ గా రావడం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేదే ఇక్కడ ప్రశ్న. “ఆది పురుష్” మూవీలో ప్రభాస్ రాముడిగా నటించాడు. ఇదేమో “హనుమాన్” మూవీ. ఈవెంట్ కు గెస్ట్ గా ప్రభాస్ రావడం కరెక్ట్ గా సరిపోతుంది. కానీ “ఆది పురుష్” మూవీ ప్రభాస్ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా ఒకవేళ ప్రభాస్ “హనుమాన్” ఈవెంట్స్ లో పాల్గొంటే సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ రిలీజ్ అయ్యాక ఆ అంచనాలను అందుకోలేకపోతే “హనుమాన్” మూవీకి కష్టాలు తప్పవు.

అసలే సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి. కాబట్టి మొదటి రోజు ఏమాత్రం మిక్స్డ్ టాక్ వచ్చినా లాంగ్ రన్ లో ఈ సినిమా థియేటర్లలో ఆడే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ అంచనాలతో “హనుమాన్” థియేటర్లలోకి వస్తేనే బెటర్ అనేది సినీ విశ్లేషకులు అభిప్రాయం. మరోవైపు బాలీవుడ్ లో ఈ మూవీకి కచ్చితంగా హైప్ కావాలి కాబట్టి ఒక విధంగా ఇది హెల్ప్ అవుతుంది. కాగా “ఆది పురుష్” మూవీ ప్రమోషనల్ ఈవెంట్లను “హనుమాన్” టీం నిర్వహించిన విషయం తెలిసిందే.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు