Happy Birthday Bandla Ganesh : మళ్ళీ ప్రొడ్యూసర్ గా కంబ్యాక్ ఇవ్వాలి

వినోదం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు బండ్ల గణేష్. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసి తనకంటూ నటుడుగానే మంచి గుర్తింపును సాధించుకున్నాడు. నువ్వు నాకు నచ్చావ్, అమ్మానాన్న తమిళ అమ్మాయి, శివమణి, మల్లీశ్వరి, పోకిరి వంటి సినిమాలు బండ్ల గణేష్ కి నటుడుగా మంచి పేరును తీసుకొచ్చాయి అని చెప్పొచ్చు. అయితే బండ్ల గణేష్ నటుడుగా రీ ఎంట్రీ ఫిలిం సరిలేరు నీకెవ్వరు అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. దాంట్లో గణేష్ కి మంచి పేరు వచ్చింది.

ఇకపోతే 2009వ సంవత్సరంలో ఆంజనేయులు అనే సినిమాతో ప్రొడ్యూసర్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అడుగు పెట్టాడు బండ్ల గణేష్. అయితే ఆ సినిమా బాగానే ఉన్నా కూడా కమర్షియల్ గా మంచి హిట్ కాలేదు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తీన్మార్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా ఇప్పటికీ ఒక కల్ట్ ను స్టేటస్ ను సాధించుకుంది .అయితే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా విజయాన్ని సాధించలేదు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ కి ఎప్పటినుంచో బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే గణేష్ కి ఎప్పటినుంచో ప్రొడ్యూసర్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉండేది. అది మాటల్లో పవన్ కళ్యాణ్ తో చెబుతూ ఉండేవాడు బండ్ల గణేష్. అయితే పవన్ కళ్యాణ్ దానిని సీరియస్ గా తీసుకొని బండ్ల గణేష్ కి తీన్మార్ అనే సినిమాను చేశాడు. అయితే ఆ సినిమా ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్లీ రెండవ ఛాన్స్ ని కూడా తనకిచ్చి గబ్బర్ సింగ్ అనే సినిమాను చేశాడు పవన్ కళ్యాణ్.

- Advertisement -

గబ్బర్ సింగ్ సినిమా తర్వాత బండ్ల గణేష్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఒక బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా అక్కడితో ఎదిగాడు బండ్ల. ఆ తర్వాత ఎన్టీఆర్ తో బాద్షా అనే సినిమాను తెరకెక్కించాడు బండ్ల గణేష్. ఆ సినిమా తర్వాత చేసిన ఇద్దరమ్మాయిలతో సినిమా కూడా బండ్ల గణేష్ కి మంచి ప్రాఫిట్స్ తీసుకొచ్చి పెట్టింది. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా గోవిందుడు అందరివాడే సినిమాను నిర్మించారు. ఆ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది.

ఇకపోతే బండ్ల గణేష్ కి మంచి పేరును అధిక లాభాలను తీసుకువచ్చిన సినిమా అంటే టెంపర్ అని చెప్పొచ్చు. టెంపర్ సినిమా సాధించిన విజయం మామూలుది కాదు. పూరి జగన్నాథ్ కూడా మంచి కంబ్యాక్ సినిమా అది. టెంపర్ తర్వాత పూరి జగన్నాథ్ కి ఇప్పటికీ ఆ స్థాయిలో హిట్ పడలేదని చెప్పొచ్చు. అయితే ఒక చిన్న సినిమా మినహాయిస్తే బండ్ల గణేష్ చేసిన సినిమాలన్నీ కూడా మాక్సిమం హిట్ అయ్యాయని చెప్పవచ్చు. అయితే మళ్లీ బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా అడుగుపెడితే చూడాలని చాలామంది ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే బండ్ల గణేష్ కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా కొంచెం ఇన్వాల్వ్ అయి ఉంటారు. మళ్ళీ బండ్ల గణేష్ సినిమాల్లోకి నిర్మాతగా రీఎంట్రీ ఇచ్చి అద్భుతమైన సినిమాలను చేస్తే ఆదరించదానికి చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. చేసినవి తక్కువ సినిమాలే అయినా కూడా అవన్నీ స్టార్ హీరోలతో చేయటం అనేది మామూలు విషయం కాదు. అతి తక్కువ టైంలో స్టార్ హీరోలతో పని చేసిన అనుభవం నిర్మాతగా బండ్ల గణేష్ కి దక్కింది. మళ్లీ స్టార్ ప్రొడ్యూసర్ గా కం బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటూ ఫిల్మీపై తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు