Sai durga tej: ప్రొడ్యూసర్ గా అవతారమెత్తిన మెగా హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించారు హీరో సాయి ధరమ్ తేజ్.. ఇటీవల తన పేరును సాయి దుర్గా తేజ్ గా మార్చుకున్నారు.. దీంతో మరొకసారి తన కెరియర్ ని కొత్తగా మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ క్రమంలోనే నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇటీవలే తెలియజేశారు.. తన తల్లి విజయ దుర్గ పేరు మీద ఒక కొత్త నిర్మాణ సంస్థను కూడా మొదలుపెట్టబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

మెగా మామయ్యల ఆశీస్సులతో..
అయితే ఈ నిర్మాణ సంస్థను మొదలు పెట్టడానికి ముందే తన మామయ్యలతో ఆశీస్సులను తీసుకున్నారట.. ఇక ఈ నిర్మాణ సంస్థ లోగో కి ముందు చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నట్లు అలాగే తన రెండవ మామయ్య నాగబాబు, మూడవ మామయ్య పవన్ కళ్యాణ్ నుంచి కూడా ఆశీస్సులు పొందినట్లు పలు రకాల ఫోటోలను రివీల్ చేశారు.. ముఖ్యంగా ఈ బడా నిర్మాణ సంస్థను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రారంభించారు.. ఈ నిర్మాణ సంస్థలలో మొదటి ప్రాజెక్టుగా తన ఫ్రెండ్స్ అంతా కలిసి తెరకెక్కించిన షార్ట్ ఫిలిం సత్య ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది..

సాయి దుర్గ తేజ్ ప్రొడక్షన్ హౌస్ లోగో అర్థం ఇదే..
సాయి దుర్గ తేజ్ తీసుకున్న ఈ నిర్ణయానికి అటు అభిమానులు ప్రశంసించడమే కాకుండా మెగా కోడలు ఉపాసన కూడా తన ఇంస్టాగ్రామ్ లో ఈ విషయంపై స్పందిస్తూ కంగ్రాట్యులేషన్స్ తెలియజేశారు.. తేజ్ నిర్మాణ సంస్థ లోగో నెటిజెన్స్ ని , అభిమానులను కూడా ఆకట్టుకుంటోంది. V అనే పదంతో లోగోని డిజైన్ చేస్తూ తీసుకు వచ్చిన తేజ్.. ఆ అక్షరం లోనే దుర్గామాతను ప్రతిబింబించేలా ముక్కుపుడకను సైతం చూపించారు.. అలాగే వి అక్షరం కింద కూడా ఇద్దరు పిల్లలను చూపిస్తూ ఒక కుక్క కూడా కనిపిస్తున్నది.

- Advertisement -

మెగా ప్రొడక్షన్ సంస్థలలో తేజ్ ఎన్నో వాడంటే..
తేజ్ దగ్గర కూడా ఒక కుక్క ఉన్నది.. అలాగే ఆ కుక్కని తనని తన తమ్ముడిని తేజ్ ప్రతిబింబించేలా ఈ లోగోని చూపించినట్లుగా తెలుస్తోంది.. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలో అరడజనుకు పైగా ప్రొడక్షన్ హౌసులు కూడా వున్నాయి.ముఖ్యంగా అంజనా ప్రొడక్షన్ హౌస్.. కొణిదెల ప్రొడక్షన్ హౌస్..పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ .. మెగా V ప్రొడక్షన్.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ తో నిహారిక.. అలాగే గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ తో సుస్మిత ఇలా ఎన్నో ప్రొడక్షన్ హౌసులు మెగా కుటుంబం నుంచే వచ్చాయి. ఇప్పుడు మళ్లీ సాయి దుర్గా తేజ్ కూడా కొత్త నిర్మాణ సంస్థతో ఆ లిస్ట్ లోకి చేరడంతో అభిమానులు ఆనంద పడుతున్నారు. మొత్తానికైతే మెగా కుటుంబం నుంచి వరుసగా హీరోలే కాదు ప్రొడక్షన్ సంస్థలు కూడా వస్తూ ఉండడంతో పలువురు పలు రకాలుగా కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అటు నటన రంగంలో ఇటు నిర్మాణ రంగంలో మరింత సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు