Sai Tej: ఆ వెబ్సైట్ చూసిన తర్వాతే గాంజా శంకర్ సినిమా ఆగిపోయింది అని తెలిసింది.

రేయ్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయిధరమ్ తేజ్. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇకపోతే ఆ తర్వాత వచ్చిన పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు సాయిధరమ్ తేజ్. అయితే సాయి ధరమ్ తేజ్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం డిజాస్టర్లే ఉన్నాయని చెప్పొచ్చు.

కానీ సాయి తేజ్ పర్సనల్ వ్యక్తిత్వం వల్ల ఇప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటూ వచ్చా వచ్చాడు అని చెప్పొచ్చు. అయితే సాయి తేజ్ కెరియర్ లో కొన్ని సినిమాలు మాత్రం అద్భుతమైన సెలెక్షన్స్ అని చెప్పొచ్చు. దేవకట్ట దర్శకత్వంలో వచ్చిన రిపబ్లిక్ సినిమా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతోపాటు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలను అందుకుంది.

రిపబ్లిక్ లాంటి ఒక కంటెంట్ ను సాయిధరమ్ తేజ్ ఓకే చేసి సినిమా చేయటం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. అయితే సాయి తేజ్ కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు విరూపాక్ష సినిమాలో మళ్లీ కంబ్యాక్ ఇచ్చాడు సాయి తేజ్. అయితే విరూపాక్ష సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమా అద్భుతమైన రికార్డును కొల్లగొట్టింది దాదాపు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సాయి ధరంతేజ్ చేస్తున్న సినిమా గాంజా శంకర్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపించాయి. రీసెంట్ గా కూడా ఈ సినిమా ఆగిపోయింది అంటూ కూడా వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమాకి తెలంగాణ యాంటి నార్కోటిక్ బ్యూరో నుంచి నోటీసులు కూడా వచ్చాయి. టైటిల్ విషయంలో కొద్దిపాటి అబ్జెక్షన్ కూడా తెలిపారు.

అయితే రీసెంట్గా ఈ విషయంపై స్పందించాడు సాయిధరమ్ తేజ్. ఒక ప్రముఖ జర్నలిస్ట్ గాంజా శంకర్ సినిమా పరిస్థితి ఏంటి? ఆగిపోయింది అంటున్నారు అని అడిగినప్పుడు. నాకు నిజంగా తెలియదండి నేను ఒక వెబ్సైట్లో చూసిన తర్వాతే నాకు తెలిసింది సినిమా ఆగిపోయింది అని చెప్పి. అంటూ మరికొన్ని వెబ్సైట్స్ గురించి కూడా ప్రస్తావిస్తూ సెటైర్లు వేశాడు సాయిధరమ్ తేజ్.

ఇకపోతే ఆ మాటలను బట్టి అర్థమవుతుంది ఏంటంటే గాంజా శంకర్ అనే సినిమా ఇంకా ఆగిపోలేదని, ఆ సినిమా జరుగుతుందని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు సాయి ధరంతేజ్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరో సినిమాలు రిలీజ్ అయినా కూడా ఆ సినిమాలకి విష్ చేస్తూ ఎప్పుడు తన వంతు ప్రయత్నం గా పదిమందితో షేర్ చేస్తుంటాడు సాయి తేజ్. ఇక సాయి తేజ్ కెరియర్లో ఎన్ని డిజాస్టర్లు ఉన్నా కూడా తన పర్సనల్ ఆటిట్యూడ్ వలన ఇప్పటికీ సాయి తేజ్ కి మంచి అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు