Hanuman : అక్కడ ఆల్రెడీ ప్రీమియర్స్ కి రెడీ అయిపొయింది..

టాలీవుడ్ లో ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో “హనుమాన్” ఒకటి. ఈ సినిమా సాధించిన విజయణ్ణని తెలుగులో ఎవ్వరూ మర్చిపోలేరు. ఎన్నో రోజులుగా వాయిదాలు పడుతూ, ఎన్నో అవాంతరాలు దాటుకుంటూ, చివరికి రిలీజ్ అయ్యాక కూడా రెండు మూడు రోజులు థియేటర్ల కోసం అవస్థలు పడాల్సి వచ్చింది ఈ సినిమా. కానీ విడుదల అయ్యాక సినీ ప్రేక్షకులే ఈ సినిమాకు సంక్రాంతి విజయం పట్టం కట్టారు. ప్రీమియర్స్ నుండే ఈ సినిమా మౌత్ టాక్ తో మంచి ఆదరణ దక్కించుకుంది. ప్రేక్షకులు ఈ సినిమాని ఎంత ఆదరించారంటే దీనితో పాటే రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలని కూడా పట్టించుకోకుండా ప్రేక్షకులు హనుమాన్ కి బ్రహ్మరథం పట్టారు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఇక జనవరి 12న రిలీజ్ అయిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా దాదాపు 310 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి భీభత్సం సృష్టించింది.

ఇండియా వైడ్ సెన్సేషన్..

హనుమాన్ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయగా ఇతరభాషల్లో పోటీవల్ల కాస్త ప్రభావం తగ్గినా, తెలుగు మరియు హిందీ భాషల ప్రేక్షకులు హనుమాన్ కు బ్రహ్మరథం పట్టారు. ఒక్క ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ వసూలు చేసిన ఈ చిత్రం ఒక్క హిందీ లోనే 60 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టిందింది. ఇక హనుమాన్ థియేట్రికల్ రన్ పరంగా బాహుబలి2, RRR సినిమాల తర్వాత 100 కోట్ల లాభాలు పొందిన మూడో సినిమా గా నిలిచిందంటే థియేటర్లలో ఎంత ఆదరించారో అర్ధం చేసుకోవచ్చు. మరి ఇంతలా పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం ఇండియా వైడ్ గా సినీ ప్రేక్షకులు అంతా ఆసక్తి గా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ఓటిటి లోనే మహాశివరాత్రికి రిలీజ్ కావాల్సి ఉండగా టెక్నికల్ ఇష్యూ కారణంగా కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని సమాచారం.

- Advertisement -

టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధం..

అయితే హనుమాన్ ఓటిటి రిలీజ్ మాట అటుంచితే హనుమాన్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయింది. లేటెస్ట్ గా హనుమాన్ టెలివిజన్ ప్రీమియర్ పై సాలీడ్ అప్డేట్ ఇప్పుడు బయటకి వచ్చింది. అయితే అది తెలుగులో కాదు. కేవలం హిందీ లో. హనుమాన్ సినిమా నార్త్ లో సినిమా మంచి వసూళ్ళని రాబట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మళ్లీ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ‘కలర్స్ సినీప్లెక్స్’ చానెల్ లో ఈ నెల అనగా మార్చ్ 16 శనివారం రాత్రి 8 గంటలకి ప్రసారం కానున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఈ విషయాన్నీ ఛానల్ వారు అధికారికంగా ప్రకటించారు. మరి హిందీలో టీవీ ప్రీమియర్స్ కి భారీ రెస్పాన్స్ వస్తాయి. ఇక హను మాన్ అక్కడ బుల్లితెరపై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక హనుమాన్ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా హరీష్ గౌర సంగీతం అందించాడు. నిరంజన్ రెడ్డి నిర్మాణం వహించారు.

తెలుగు అప్డేట్..

హనుమాన్ హిందీ వెర్షన్ రెడీ అయినా తెలుగులో మాత్రం ఓటిటి రిలీజ్ తర్వాతే అని తెలుస్తుంది. బహుశా తెలుగులో హనుమాన్ జయంతి సందర్బంగా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక హనుమాన్ సిటీ ఏరియాల్లో ఇప్పటికి అక్కడక్కడా ప్రదర్శితమవుతూనే ఉంది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు