Samantha : ఆ గాయమే సమంతను క్రుంగదీసిందా?

టాలీవుడ్ లో లాంగ్ టర్మ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అతి తక్కువ మంది హీరోయిన్ల లో సమంత ఒకరు. గ్లామర్ తో పాటు నటన కూడా ఉన్న ఈ బ్యూటీ పేరుకి మలయాళం భామ అయినా తెలుగమ్మాయిలాగే ఇక్కడ మంచి క్రేజ్ తో పాటు ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ని తెచ్చుకుంది. ఇక సౌత్ లోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఈ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా ‘ఖుషి’ మూవీ చేసిన తర్వాత సినిమాల నుంచి కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే మాయోసైటిస్ డిసీస్ నుంచి కోలుకుంటున్న సమంత ఎప్పటిలాగే సోషల్ మీడియాలో అయితే చాలా యాక్టివ్ గా ఉంటోంది.

ఫెమినా బ్యూటీ..

ఇక సమంత చాలా కాలంగా పలు సంస్థ లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూనే, పలు మ్యాగ్జైన్ లకు ఎప్పటికప్పుడూ ఫోజులిస్తూ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇక లేటెస్టుగా ఆమె ఇంస్టాగ్రమ్ ద్వారా పంచుకున్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఫెమినా ఇండియా మ్యాగజైన్ కోసం చేసిన ఈ ఫొటో షూట్ గురించి నెట్టింట భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఫోటో షూట్ లో సమంత మాంచి కిల్లర్ లుక్ లో స్టన్నింగ్ గా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం మేకప్ బాగాలేదని, హెయిర్ స్టైలింగ్ సెట్ అవ్వలేదని అభిప్రాయ పడుతున్నారు. ఇంకొందరు ట్రేడ్ విమర్శకులు అయితే సామ్ ఇలాంటి ఫోటోషూట్ ల వల్ల అప్పటికప్పుడు మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నా, ఇలాంటి వాటి వల్ల ముందు ముందు విమర్శలకు గురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సంగతి అటుంచితే, ఫెమినాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

- Advertisement -

మనసుకైన గాయం..

సమంత లేటెస్ట్ గా ఫెమినా మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ, మనపై మనకున్న విశ్వాసమే గొప్ప వ్యక్తిగా ఎదగడానికి సహాయపడుతుందని పేర్కొంది. అలాగే తన జీవితంలో చాలా తక్కువ సార్లు ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నానని తెలిపింది. అప్పుడే తాను అభద్రతాభావానికి లోనవుతున్నానని తెలుసుకోగలిగానని, దాన్నుంచి తొందరగా బయటకు వచ్చాను గాని, బయట గాయాల కంటే మనసుకైన గాయం నుంచి కోలుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుందని
ఆ మ్యాగజైన్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ అంది. అయితే సమంత అంతర్గత గాయం, మనసుకైన గాయం అని కామెంట్లు చేయడం ఏంటి? అని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే గత కొన్ని నెలలుగా మైయోసిటిస్‌ వ్యాధితో పోరాడుతుండటం గురించి సమంత ఇలాంటి వ్యాఖ్యలు చేసిందా? లేదా నాగ చైతన్య తో విడాకులు తీసుకోవడం గురించి ఇలా మాట్లాడిందా? అని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

చై ని ఉద్దేశించి మాట్లాడిందా?

ఇక ఫెమినా ఇంటర్వ్యూలో సమంత చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే సమంత నాగ చైతన్య దాదాపు 6 ఏళ్ళ పాటు ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. కానీ నాలుగేళ్లు గడవకముందే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. దాని తర్వాతే లాక్ డౌన్ తర్వాత కొన్ని రోజులకే తాను మైయోసిటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. అయితే అప్పటి నుంచి చికిత్స తీసుకుంటూ, సినిమాల నుంచి విరామం తీసుకుంది.ఆ తర్వాత గతేడాది ‘శాకుంతలం’, ‘ఖుషి’ చిత్రాలతో పలకరించిన సామ్.. మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ ఏదీ సైన్ చేయలేదు. పైగా ఆల్రెడీ కమిటైన సినిమాల నుంచి తప్పుకోవడంతో, అవి వేరే హీరోయిన్ల చేతికి వెళ్లిపోయాయి. మరి సమంత నుండి మళ్ళీ సినిమా వచ్చేది ఎప్పుడో.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు