Kalki2898AD : మహాశివరాత్రి స్పెషల్ పోస్టర్.. సాలిడ్ గా.. డౌటు గానూ..

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి2898AD”. ఈ సినిమాపై పాన్ ఇండియా వైడ్ గానే కాదు ఇంటెర్నేషనల్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. టాలీవుడ్ హల్క్ రానా దగ్గుపాటి ఈ సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ సినిమాని ప్రమోట్ చేస్తుండడం విశేషం. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీ బ్యానర్ వారు నిర్మిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ తో నేషనల్ వైడ్ గా సాలిడ్ క్రేజ్ ని తెచ్చుకుంది. ఇక కల్కి మహావిష్ణు అవతారం పేరుతో మైథలాజి టచ్ కూడా ఓ రేంజ్ హైప్ తీసుకుని వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా నుండి వచ్చే పోస్టర్లు మాత్రం సినిమాపై ఎప్పుడూ ఏదో ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తూ వచ్చాయి. ఫస్ట్ లుక్ రిలీజ్ అయినపుడు ఫ్యాన్ మేడ్ పోస్టర్ లా ఉందని కామెంట్స్ వచ్చాయి. సెకండ్ లుక్ రిలీజ్ అయినపుడు రాజు బులెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాడని ట్రోల్స్ వచ్చాయి. ఇక తాజాగా మహా శివరాత్రి స్పెషల్ గా రిలీజ్ చేసిన ఒక కొత్త పోస్టర్ మంచి హైప్ ని తీసుకురావడంతో పాటు కొన్ని అనుమానాల్ని కూడా తీసుకొచ్చింది.

మహాశివరాత్రి స్పెషల్ పోస్టర్..

మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా సినిమా లవర్స్ కోసం చాలా సినిమాల నుండి అప్డేట్స్ లు పోస్టర్లు వచ్చాయి. అయితే అందులో ఎక్కువ‌గా ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది మాత్రం క‌ల్కి నుంచి రిలీజ్ చేసిన ప్ర‌భాస్ లుక్కే. ఇక ఇంతకు ముందు రిలీజ్ చేసిన పోస్టర్స్ కంటే ఇది సాలిడ్ గా ఉందని చెప్పొచ్చు.అయితే ముందు పోస్టర్ ట్రోలింగ్ అయితే, ఈ పోస్టర్ మాత్రం మంచి హైప్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఇక క‌ల్కి2898 AD లేటెస్ట్ లుక్ విష‌యానికి వ‌స్తే.. రెబల్ స్టార్ ప్రభాస్ పాత్ర పేరు ఈ సినిమాలో “భైర‌వ”
అని సినిమాలో క్యారెక్ట‌ర్ నేమ్ రివీల్ చేస్తూ వ‌దిలిన లేటెస్ట్ లుక్ అభిమానుల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌భాస్‌ను ఔట్ ఫోక‌స్‌లో చూపిస్తున్న‌ట్లుగా ఉన్న‌ప్ప‌టికీ అభిమానులు హ్యాపీ గానే ఉన్నారు. ఇక ప్రభాస్ దేహదారుడ్యంతో స్టిల్ ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి.

- Advertisement -

ఇక్కడే అనుమానం..

అయితే ఇంతవరకు బాగానే ఉంది గాని, మహా శివరాత్రి సందర్బంగా రిలీజ్ చేసిన కొత్త పోస్ట‌ర్ మీద రిలీజ్ డేట్ లేక‌పోవ‌డ‌మే సందేహాల‌కు తావిస్తోంది. ప్రభాస్ క‌ల్కి2898AD సినిమాని మే 9న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు కొన్ని నెలల ముందే ప్ర‌క‌టించారు. ఐతే మ‌ధ్య‌లో వాయిదా వార్త‌లు జోరుగా వినిపించినా కానీ టీం మాత్రం మే 9కే వ‌స్తామ‌ని ఖచ్చితంగా చెప్తూ వచ్చారు. మరి రిలీజ్ డేట్ విష‌యంలో అంత పక్కాగా ఉన్న‌పుడు లేటెస్ట్ పోస్ట‌ర్ మీద మే 9న విడుద‌ల అని ఎందుకు వేయ‌లేదు అని అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే ఈ సినిమా పోస్టర్ అనౌన్స్ మెంట్ కి ముందు మార్నింగ్ శివరాత్రి సందర్బంగా సినిమాలో ఒక శివలింగం విగ్రహాన్ని చూపిస్తూ పోస్టర్ వదిలారు. అందులో రిలీజ్ డేట్ ఉంది. కానీ సాయంత్రం వచ్చిన పోస్టర్ లో మాత్రం రిలీజ్ డేట్ మిస్ అయింది. మరి దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే గాని ఫ్యాన్స్ కి అనుమానం తొలగిపోదు.

ఇక కల్కి సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు అనుకున్న ప్ర‌కారం పూర్త‌వుతాయా లేదా అనే విష‌యంలో అనుమానాలున్నాయి. పైగా రిలీజ్ డేట్ కి సరిగ్గా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే వేర్వేరు దేశాల్లో చేయిస్తున్న విజువ‌ల్ ఎఫెక్ట్స్ కోరుకున్న క్వాలిటీతో రావ‌డం చాలా ఇంపార్టెంట్. దాన్ని బ‌ట్టే రిలీజ్ డేట్‌పై తుది నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని సమాచారం. ఇక అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులు నటిస్తున్న ఈ చిత్రం రిలీజ్ ఆలస్యమైనా కంటెంట్ ప్రేక్షకుల్ని మెప్పిస్తే చాలు అనేది ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు