Gang Leader : చిరు క్రేజ్ గురించి ఉపేంద్ర మాటల్లో..

టాలీవుడ్ మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీ రామారావు తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేసి నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమని ఏలుతున్న వ్యక్తి. పదేళ్ల గ్యాప్ ఇచ్చి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చినా చెక్కు చెదరని ప్రజాదరణ తో ఇప్పటి టాప్ హీరోలని మించి పోటీనిస్తున్నారు. ఒకప్పుడు ఇండియా లోనే అత్యధికంగా పారితోషకం తీసుకున్న చిరంజీవి గురించి ఈ జెనరేషన్ ఆడియన్స్ కి ఆ రోజుల్లో క్రేజ్ గురించి తెలియదు. అది గతమైనప్పటికీ టాలీవుడ్ ఆడియన్స్ గుర్తుంచుకోవాల్సిన ఎన్నో విషయాలు తెలుగు సినీ చరిత్రలో ఉన్నాయి. టాలీవుడ్ లోనే ఎవరికీ లేనన్ని అక్షరాలా 8 ఇండస్ట్రీ హిట్లు ఉన్న ఏకైక హీరో చిరంజీవి మాత్రమే. ఆ ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా స్థానం ప్రత్యేకమైనది.

గ్యాంగ్ లీడర్ భీభత్సం..

మెగాస్టార్ చిరంజీవి అప్పటికే జగదేక వీరుడు అతిలోక సుందరి, కొండవీటి దొంగ, కొదమసింహం లాంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో ఊపు మీదుండగా, ఒక సింపుల్ కామన్ మ్యాన్ ఊర మాస్ డ్రామాతో వచ్చిన గ్యాంగ్ లీడర్ ఆ రోజుల్లో పెను సంచలనమే సృష్టించింది. చిరంజీవి, విజయశాంతి జంటగా, విజయబాపినీడు దర్శకత్వం లో వచ్చిన ఆ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా 100 రోజుల వేడుకను ఒకేరోజు నాలుగు చోట్ల ప్లాన్ చేసి ఆ రోజుల్లో ప్రత్యేకంగా హెలికాఫ్టర్ ని ఆ వేడుకల కోసం వాడడం సెన్సేషన్ అని చెప్పాలి. ఇక గ్యాంగ్ లీడర్ రిఫరెన్స్ ని ఇప్పటికి చాలా సినిమాల్లో వాడడం చూస్తూనే ఉంటాం. టాలీవుడ్ కి ఏ కొత్త హీరో వచ్చినా గ్యాంగ్ లీడర్ సినిమా పేరును అందులో సగం మంది హీరోలైనా వాడుతారు.

- Advertisement -

గ్యాంగ్ లీడర్ గురించి ఉపేంద్ర మాటల్లో..

ఇక చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా ఆరోజుల్లోనే చాలా మంది దర్శకుల్ని, నటుల్ని ఇన్స్పైర్ చేసింది. గ్యాంగ్ లీడర్ సినిమా క్రేజ్ గురించి రీసెంట్ గా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న UI సినిమా ఇంటర్వ్యూ లో భాగంగా, ఉపేంద్ర మాట్లాడుతూ ఈ రోజుల్లో కంటెంట్ ని బట్టి సినిమా చూస్తారు. అది ఏ భాష అయినా డబ్ చేస్తే, కంటెంట్ బాగుంటే చాలు హీరో ఎవరైనా సరే సినిమా ని హిట్ చేస్తారు జనాలు. కానీ ఆ రోజుల్లో డబ్బింగ్ కూడా కాకుండా వచ్చిన ఇతర స్ట్రెయిట్ సినిమాల్ని ఓ రేంజ్ లో చూసే వారు ఆడియన్స్. ఆ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ తెలుగు వెర్షన్ కర్ణాటక లో రిలీజ్ అయితే విడుదల చేసిన అన్ని థియేటర్లలో మూడు వారాల పాటు హౌస్ ఫుల్ అయ్యాయి. ఇప్పుడు ఈ తరం హీరోలకి కూడా ఆయన ఆదర్శం అన్నారు.

గ్యాంగ్ లీడర్ రీమేక్ చేసిన ఉపేంద్ర..

గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా సెన్సేషన్ ని చూసి 12 ఏళ్ళ తర్వాత ఉపేంద్ర హీరో గా కన్నడలో రీమేక్ చేసాడు. కుటుంబ పేరుతో కన్నడ లో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 125 రోజులు ఆడింది. ఇక ఉపేంద్ర తాజాగా UI సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు