Ram Charan : అమ్మ కోసం చరణ్ వంట.. పక్కనే ఉపాసన ప్రమోషన్!

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్య సోషల్ మీడియాలో రోజూ కనిపిస్తున్నాడు. రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ అప్డేట్స్ రాకపోయినా, తన తదుపరి సినిమాల గురించి ఏ విషయాలు సోషల్ మీడియా లో రాకపోయినా, చెర్రీ మాత్రం కొన్ని రోజులుగా ఇంటా, బయట అన్ని చోట్ల హడావిడి చేస్తున్నాడు. ఆ మధ్య అంబానీ కొడుకు పెళ్ళిలో హడావిడి చేసిన, చరణ్ రీసెంట్ గా పుణే లో జరిగిన ISPL క్రికెట్ టీమ్ తో స్టార్లు సచిన్ టెండూల్కర్, అలాగే సూర్య, అక్షయ్ కుమార్ తో సందడి చేసారు. ఇక మహా శివరాత్రి సందర్బంగా చరణ్ సినిమాల నుండి ఏవైనా అప్డేట్స్ వస్తాయని మెగా ఫ్యాన్స్ అనుకున్నా ఏమి రాలేవు గాని, చరణ్ ఉమెన్స్ డే సందర్బంగా అమ్మ కోసం వంట చేసే వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

అమ్మ కోసం చెర్రీ వంట..

మెగా ఫ్యామిలి తమ ఇంట్లో వాళ్ళతో ఉన్న అనుబంధాలు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో సరదాగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు. సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే చరణ్ కి ఉపాసన కి అందుకే అంత ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఉమెన్స్ డే స్పెషల్ గా ఉపాసన ఓ వీడియో షేర్ చేసింది. గతంలో చిరంజీవి, రామ్ చరణ్ వంటలు వండుతుంటే వాళ్ళు తమ వీడియోలు షేర్ చేశారు. అలాగే తాజాగా ఉమెన్స్ డే సందర్బంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వాళ్ళ అమ్మ సురేఖ కోసం స్పెషల్ గా వంట చేసాడు. చరణ్ వంట చేస్తుంటే అమ్మ సురేఖ పక్కనే ఉంది. ఇక ఉపాసన ఏమో ఇదంతా వీడియో తీస్తుంది.

- Advertisement -

ఉపాసన ప్రమోషన్స్ ఛానెల్ కోసం…

అలా చరణ్ వంట చేస్తుంటే తన భార్య ఉపాసన మాత్రం పనిలో పనిగా తన అత్తమ్మాస్ కిచెన్ ప్రమోషన్స్ చేస్తుంది. చరణ్ వంట చేస్తుంటే ఉపాసన వచ్చి.. అత్తమ్మ గారండీ ఈ రోజు మీ కిచెన్ లో ఏం అయితుంది అంటే, సురేఖ.. ఏమవుతుంది, దోస అయితుంది, నా కొడుకు నా కోసం వండుతున్నాడు అన్నారు. ఉమెన్స్ డే అని ఇవాళ తనే మనకు వండుతున్నాడు అని చెప్పింది. దీంతో ఉపాసన.. రోజూ ఉమెన్స్ డే ఉంటే బాగుండు అంది. ఇక చరణ్ వంట చేస్తుంటే ఏం వండుతున్నావు అని అడగ్గా.. పన్నీర్ టిక్కా మా అమ్మ కోసం అని చెప్పాడు. ఈ వీడియోని ఉపాసన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. అమ్మ కోసం వంట వండుతున్న చరణ్ వీడియో చూస్తుంటే క్యూట్ గా ఉంది.

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే కానుక గా గేమ్ ఛేంజర్ నుండి జరగండి సాంగ్ రిలీజ్ అవుతుంది. ఇక ఈ లోపు బుచ్చిబాబు తో కూడా సినిమా మొదలుపెట్టే అవకాశం ఉంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు