Sai Durga Tej: నా పేరులో అమ్మ పేరు యాడ్ చేసుకున్న

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో సాయిధరమ్ తేజ్ ఒకరు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయి తేజ్, రేయ్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత పిల్లా నువ్వు లేని జీవితం సినిమా మంచి హిట్ అయి సాయి తేజ్ వరుస సినిమాలను చేసుకుంటూ వచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సుప్రీమ్ సినిమా సాయి తేజ్ కి మంచి హిట్ అయింది. అలానే హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయింది.

అయితే సాయి ధరమ్ తేజ్ చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలిపోయాయి. తిక్క, ఇంటిలిజెంట్ సినిమాలు అంతంత మాత్రమే ఆడాయి. ఇకపోతే దేవకట్ట దర్శకత్వంలో వచ్చిన రిపబ్లిక్ సినిమా సాయి తేజ్ కి మంచి పేరును తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ అవుతున్న తరుణంలో సాయి తేజ్ ఒక యాక్సిడెంట్ కి గురైయ్యాడు. అయితే దాదాపు చావు అంచుల వరకు వెళ్ళిన సాయి మళ్లీ కోల్కొని కం బ్యాక్ ఇచ్చాడు.

అయితే సాయి తేజ్ చేసిన లేటెస్ట్ ఫిలిం విరూపాక్ష. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలమైన ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. అయితే దాదాపు ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో సాయి తేజ్ సరసన సంయుక్త మీనన్ నటించింది. ఈ సినిమాతో దర్శకుడు కార్తీక్ దండు కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడని చెప్పొచ్చు.

- Advertisement -

ఇకపోతే సాయి ధరమ్ తేజ్ పర్సనల్ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా తప్ప ఇంకో వ్యాపారం తెలియని యంగ్ హీరో. ఏ హీరో సినిమా రిలీజ్ అయినా కూడా ఆ సినిమాను విష్ చేస్తూ ట్విట్టర్ వేదికగా ఆ సినిమాని పదిమందికి తెలిసేలా ప్రమోట్ చేయడం సాయి తేజ్ గొప్పతనం. అయితే ప్రతి హీరో సినిమాకి మంచి సపోర్ట్ చేస్తాడు సాయి ధరమ్ తేజ్.

ఇక సాయి తేజ్ పర్సనల్ లైఫ్ లో కూడా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. కొన్ని విషయాల్లో సాయి ఆలోచించే విధానం కూడా చాలామందికి ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. చాలామందికి ఇష్టమైన మెగా మేనల్లుడు సాయి తేజ్ అని చెప్పొచ్చు. ఇక సాయి తేజ్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద వీరాభిమాని అని కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయి తేజ్ చేసిన చాలా సినిమాల్లో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి.

ఇకపోతే సాయి తేజ్ సత్య అని ఒక షార్ట్ వీడియోని చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ప్రీమియర్ కి హాజరైన సాయి తేజ తన పేరులోని చిన్న అడిషన్ తీసుకున్నట్టు అనౌన్స్ చేశాడు. సాయిధరమ్ తేజ్ పేరును ఇకపై సాయి దుర్గా తేజ్ అని పెట్టుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే మామూలుగా ఫాదర్ పేరు సర్ నేమ్ లో ఉంటుంది కాబట్టి, నా పేరులో నాతో పాటు అమ్మ ఉండాలని ఇలా పెట్టుకున్నానని చెప్పుకొచ్చాడు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు