Anasuya: పుష్ప -2 లో అనసూయ అరాచకం.. నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసిన సుకుమార్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బుల్లితెర, సోషల్ మీడియా ద్వారా కూడా భారీ క్రేజ్ సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ స్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు.. అనసూయ టాలెంట్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది.. కొన్నేళ్ల పాటు బుల్లితెర ప్రేక్షకులను తన యాంకరింగ్ తో బాగా అలరించిన ఈమె.. ఆ తర్వాత నటిగా ఎంట్రీ ఇచ్చి విభిన్నమైన పాత్రలలో నటించింది.. ముఖ్యంగా రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించిన అనసూయ.. రంగమ్మత్తగా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది అంతేకాదు ఈమె యాక్టింగ్ కి చాలామంది ఫిదా అయ్యారు కూడా..

పుష్ప మూవీలో దాక్షాయిని గా…
ఆ తర్వాత ఎన్నో రకాల పాత్రలలో నటించింది అనసూయ కానీ పుష్ప లో నటించిన దాక్షాయని పాత్ర మాత్రం మరింత క్రేజ్ తెచ్చి పెట్టింది.. ఇప్పుడు ఈ పాత్రను మించేలా పుష్ప-2 లో అనసూయ పాత్రను హైలెట్ చేయబోతున్నారట సుకుమార్.. పుష్ప చిత్రంలో అనసూయ ను ఊహించుకొని ఒక పాత్రను సైతం డైరెక్టర్ సుకుమార్ సృష్టించారు.. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా అనసూయ నటించడంతో పుష్ప -2 లో కూడా ఈమె పాత్ర మరింత హైలెట్ గా చూపించబోతున్నారట..

పుష్ప పై రివేంజ్ హైలెట్..
పుష్ప మొదటి భాగంలో దాక్షాయిని పాత్రలో మంగళం శీను భార్యగా చూపించారు..అంతేకాదు విలన్ గా చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.. ఇప్పటికే ఈ చిత్రంలో చాలామంది పవర్ఫుల్ విలన్స్ ను కూడా తీసుకున్నప్పటికీ.. దాక్షాయిని పాత్రకు మాత్రం రివేంజ్ తీర్చుకోవడానికి రెండు బలమైన కారణాలు ఉండే విధంగా ప్లాన్ చేశారట సుకుమార్.. ఒకటి దాక్షాయని తమ్ముడిని హత్య చేయడం అలాగే తన భర్త నుంచి సిండికేట్ లాక్కొని పుష్ప ఎదగడంతో పాటు.. తన భర్త పై తననే దాడి చేసేలా పరిస్థితి తీసుకురావడంతో పుష్ప పైన దాక్షాయిని ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది అనే విషయాన్ని పార్ట్2 లో గట్టిగానే సుకుమార్ చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

విలన్స్ తో దాక్షాయిని..
అంతేకాకుండా మరో విలన్ బన్వర్లాల్ షేక్షావత్ తో దాక్షాయిని చేతులు కలిపి పుష్పని ఎలా చంపాలి అనే ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఇప్పటివరకు అనసూయ ఎలాంటి పాత్ర చేసిన ప్రేక్షకులలో మంచి ఇంఫాక్ట్ కలిగించేలా చేసింది.. మరి ఇప్పుడు దాక్షయిని పాత్ర చూసిన తర్వాత అనసూయ పేరే మారిపోతుందనే విధంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అలా పుష్ప-2 లో అనసూయ అరాచకం సృష్టిస్తుందని టాక్ అయితే వినిపిస్తోంది..

జపాన్లో కూడా క్రేజ్..
పుష్ప సినిమా ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా స్ట్రాటజీలో ముందుకు వెళ్తోంది.. పుష్ప సినిమాకి జపాన్ లో కూడా భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి.. పుష్ప -2 చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నారు.. మరి అనసూయ పాత్ర కోసం చాలామంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అనసూయ ఈ పాత్రతో ఎలాంటి విషయాన్ని అందుకుంటుందో చూడాలి..

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు