Rajinikanth: రజనీకాంత్ లాల్ సలామ్ మూవీకి అన్ని కోట్లు నష్టమా..?

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లాల్ సలామ్.. ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా మూటకట్టుకుంది.. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని తెరకెక్కించగా ఇందులో విష్ణు విశాల్ , విక్రాంత్ హీరోలుగా నటించారు. రజనీకాంత్ గెస్ట్ అప్పియరెన్స్ గా కనిపించినా పెద్దగా సక్సెస్ కాలేదు.. జైలర్ సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రజినీకాంత్.. ఆ తర్వాత విడుదలైన లాల్ సలాం పైన భారీగానే అంచనాలు క్రియేట్ అయ్యాయి కానీ వాటన్నిటిని మించి మరీ ఫ్లాప్ అయ్యింది..

బడ్జెట్ మరియు కలెక్షన్ వివరాలు..
మొదటి షో నుంచి ఆడియన్స్ లో నెగటివ్ టాక్ రావడంతో ఈ సినిమా చూసేందుకు ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు.. దీంతో చాలా దారుణంగా కలెక్షన్స్ కూడా పడిపోయాయి. దాదాపుగా రూ .90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో పాటు రూ .15 కోట్ల కలెక్షన్స్ ని మాత్రమే రాబట్టింది.. రజినీకాంత్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ అట్టర్ ఫ్లాప్ మూవీగా లాల్ సలామ్ సినిమా నిలిచిపోయింది..

ఫ్లాప్ అవడానికి కారణం నాన్నే..
అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడానికి కారణం తన తండ్రి అని తెలియజేస్తోంది ఐశ్వర్య రజనీకాంత్ ..ఇటీవలే ఒక మీడియాతో మాట్లాడుతూ.. మొదట ఒరిజినల్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు నాన్న రజినీకాంత్ చేసిన మొయిద్దీన్ పాత్ర సెకండ్ ఆఫ్ లో కేవలం 10 నిమిషాలు మాత్రమే రావాలి ..కానీ రజనీకాంత్ ఫస్ట్ ఆఫ్ లో మిస్ అయితే ఆయన అభిమానులు చాలా ఫీల్ అవుతారని విడుదలకు ముందు మేము ఎడిటింగ్ లో కొన్ని మార్పులను సైతం చేసాము.. అలా మొదటి భాగంలోనే మొయిద్దీన్ పాత్రను కూడా పరిచయం చేశామని వెల్లడించింది.

- Advertisement -

కథ అందుకే మారింది..
అయితే ఫస్టాఫ్ లో రజనీకాంత్ ని చూసినప్పుడు సెకండ్ హాఫ్ లో కూడా ఆయనే ఉంటారని అందరూ అనుకున్నారు.. కానీ ఆ పాత్ర పైన ఫోకస్ చేయడం మొదలుపెట్టారు.. దీంతో కథ చాలా లాంగ్ అయిపోయింది ..మిగతా పాత్రలను అసలు ఎవరు పట్టించుకోలేదంటూ తెలియజేసింది.. కేవలం విడుదల సమయానికి రెండు నెలల ముందే ఈ మార్పులు చేయడంతో ఇలా మారిపోయిందని తెలియజేసింది. తన తండ్రి రజనీకాంత్ వల్లే ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని మార్చేయవలసి వచ్చిందని తెలిపింది.

అయితే రజిని ఫ్యాన్స్ మాత్రం తమ హీరోని ఈ కథలోకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది అంటూ ఐశ్వర్య రజనీకాంత్ ను ప్రశ్నిస్తున్నారు. స్క్రిప్ట్ ఒకసారి డిజైన్ చేసిన తర్వాత దానిని చివరిలో మార్చకూడదని కామెంట్స్ చేస్తున్నారు..ఈ చిత్రానికి కేవలం రజనీకాంత్ ఒప్పుకున్నది తన కూతురు దర్శకత్వం అనేది నిజమన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ట్రైలర్ , టీజర్ విడుదలైన తర్వాత ఈ సినిమాకి భారీ క్రేజ్ ఏర్పడింది.. ఆ అంచనాలను మించి ఫ్లాప్ అయ్యిందని చెప్పవచ్చు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు