Rp Patnaik: ఒకప్పటి సంగీత సంచలనం

నీకోసం సినిమాతో సంగీత దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు ఆర్పి పట్నాయక్. ఆర్పి పట్నాయక్ అసలు పేరు రవీంద్ర ప్రసాద్ పట్నాయక్. కానీ స్క్రీన్ నేమ్ ఆర్పి పట్నాయక్. కేవలం సంగీత దర్శకుడుగానే కాకుండా దర్శకుడిగా, నటుడుగా, ప్లే బ్లాక్ సింగర్ గా తనను తాను ప్రూవ్ చేసుకుని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఆర్పి పట్నాయక్. ఇప్పుడు ప్రేక్షకులకి అంతగా తెలియకపోయినా ఒకప్పుడు ఆర్పి పట్నాయక్ సాంగ్స్ అంటే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి కాంపిటీషన్ గా ఆర్పి పట్నాయక్ సాంగ్స్ ఉండేవి.

ఆర్పి పట్నాయక్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఉన్నాయి. ఒక్కో పాట ఒక ఆణిముత్యం. కేవలం ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ వల్ల కూడా హిట్ అయిన సినిమాలు ఉన్నాయంటే అది అతిశయోక్తి కాదు. ఇకపోతే ఆర్పి పట్నాయక్ తేజ కాంబినేషన్లో అద్భుతమైన ఆల్బమ్స్ వచ్చాయి. చిత్రం, నువ్వు నేను, జయం, నిజం వంటి ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించాడు ఆర్పి పట్నాయక్.

ఆర్పి పట్నాయక్ కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. అయితే ఆ సినిమాలేవి బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని సాధించలేదు. ఇప్పటికీ ఆర్పి పట్నాయక్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే. అలానే శ్రీను వసంతలక్ష్మి వంటి సినిమాల్లో నటుడుగా కూడా కనిపించి తనదైన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు ఆర్పి పట్నాయక్.

- Advertisement -

ఇకపోతే ఆర్పి పట్నాయక్ రీసెంట్ గా తేజ దర్శకత్వంలో వచ్చిన అహింస సినిమాకి సంగీత అందించాడు. ఆర్పి పట్నాయక్, తేజ మధ్యలో ఉన్న బాండింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అన్ని వీరి కాంబినేషన్లోనే వచ్చినవే.

ఇకపోతే కమర్షియల్ సాంగ్స్ ను సినిమాల్లో పెట్టి అద్భుతమైన ఆదరణను పొందారు ఆర్పి పట్నాయక్. అలానే మణిశర్మ చేసిన ఇంద్ర సినిమాలో కూడా ఒక పాటను కంపోజ్ చేశారు ఆర్పి పట్నాయక్. ఇప్పుడు తేజ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 2.0 సినిమాకి మళ్లీ సంగీత దర్శకుడుగా పని చేయనున్నారు. ఈ సినిమా ఇటు తేజ కి అటు ఆర్పి పట్నాయక్ కూడా మంచి కంబ్యాక్ అవ్వాలని చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే వీరి ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో సినిమాలు మ్యూజికల్ హిట్ తో పాటు బ్లాక్ బస్టర్ కూడా అయ్యాయి.

కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, హిందీ, తమిళ్ లో కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు ఆర్పి పట్నాయక్. అలానే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నువ్వు నేను, సంతోషం సినిమాలకు అవార్డులను అందుకున్నాడు ఆర్పి పట్నాయక్. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఆర్పి పట్నాయక్ కి మధ్య మంచి స్నేహబంధం ఉంది.
కొంతకాలం సునీల్, త్రివిక్రమ్, ఆర్పి పట్నాయక్ ఒకే రూమ్ లో కలిసి ఉన్నారు. ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలకు సంగీతం అందించిన ఆర్పి పట్నాయక్ కి, ఫిల్మీపై తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మళ్లీ అద్భుతమైన ఆల్బమ్ తో కం బ్యాక్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు