Upendra : ఉప్పి స్టయిల్లోనే UI..

Upendra

కన్నడ సూపర్ స్టార్ విలక్షణ నటుడు ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒక్క కన్నడలోనే గాకుండా సౌత్ ఇండియా అంతటా మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న ఈయన ఒకప్పుడు దర్శకుడిగా శంకర్ ని మించిన సినిమాలు తీసేవారు. అప్పట్లోనే చాలా అడ్వాన్స్డ్ గా ఉపేంద్ర సినిమాలుండేవి. అయితే డైరెక్టర్ గా ఉపేంద్ర మెగాఫోన్ పట్టి చాలా కాలం అయింది. ఇప్పుడు తాజాగా ‘UI’ అనే చిత్రంతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఉపేంద్రయే హీరోగా చేస్తున్న ఈ సినిమా నుండి ఇంతకు ముందే వచ్చిన పోస్టర్ టీజర్ తోనే తన మార్క్ చూపిస్తూ ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రెజెంట్ చేసారు.

ఇక తాజాగా UI నుండి ఫస్ట్ సాంగ్ అప్డేట్ కూడా రాగా, ఒక సాలిడ్ పోస్టర్ ద్వారా ఈ అప్డేట్ ని చెప్పడం జరిగింది. పోస్టర్ చూస్తుంటే యూపీ స్టయిల్లోనే ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఫస్ట్ సింగిల్ ప్రోమోని ఫిబ్రవరి 14న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించడం జరిగింది. ఈ సినిమాలో ఉపేంద్ర ఇంట్రో సాంగ్ ఉండే అవకాశం ఉంది.

- Advertisement -

ఇక ఉపేంద్ర తన కెరియర్లో దర్శకత్వం వహిస్తున్న 11వ సినిమాగా UI చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపుగా రూ .100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా కోసం ఉపేంద్ర ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యూజిక్ క్రియేషన్స్ సరికొత్త టెక్నాలజీని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో 90% గ్రాఫిక్స్ ఉంటాయని కూడా తెలియజేశారు. ఉపేంద్ర తో రీష్మా , సన్నీలియోన్, నిధి సుబ్బయ్య , ఇంద్రజిత్ లంకేష్, మురళి శర్మ తదితరులు నటిస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు