Razakar Trailer Talk : నిజాం నిరంకుశ పాలనకు తిరుగుబాటే ఈ రజాకార్..!

Razakar

టాలీవుడ్ లో తెలంగాణ నేపథ్యంలో ఇప్పుడు చాలా సినిమాలే వస్తున్నా, చారిత్రక నేపథ్యంలో వచ్చిన చిత్రాలు తక్కువ. మా భూమి, కొన్నేళ్ళకిందట వచ్చిన రుద్రమ దేవి, అలాగే పలు ఫిక్షనల్ స్టోరీస్ తో రాజన్న లాంటి సినిమాలు వచ్చాయి. అయితే తెలంగాణ నిజాం ప్రభుత్వానికి సంబంధించి, అప్పటి రజాకార్లు ప్రజలను ఎలాంటి చిత్ర హింసలకు గురి చేశారన్న నేపథ్యంలో “రజాకార్” అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుండి ఇంతకు ముందు వచ్చిన టీజర్, ఇంకా పాటలు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని తెచ్చుకోగా, తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది.

ఇక రజాకార్ ట్రైలర్ ఒక్కసారి గమనించగా, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక తెలంగాణా లో స్వాతంత్య్రం వచ్చిన టైం లో తెలంగాణ లో జరిగిన అరాచకాలను ఈ ట్రైలర్ లో లో కళ్ళకి కట్టినట్టు చూపించడం జరిగింది. అలాగే భారత్ లో తెలంగాణ కలవక ముందు రజాకార్లు ఎన్ని ఆక్తృత్యాలు చేసారో, దానికి ప్రజలు ఎలా తిరగబడ్డారో, ఫైనల్ గా భారత ఆర్మీ సైన్యం సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో తెలంగాణ ని భారత్ లో ఎలా కలిపారో ఈ సినిమాలో చూపించబోతున్నట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణా లో ‘పిల్లలమర్రి’ ప్రాంతంలో జరిగిన అమానుష చర్యలు, అలాగే బైరాన్ పల్లి మారణహోమం గురించి ఈ సినిమాలో చెప్పబోతున్నారని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది.

- Advertisement -

అయితే ఈ సినిమా ట్రైలర్ నిర్మాణ విలువల పరంగా అంతగా ఆకట్టుకోవడం లేదు. గ్రాఫిక్స్ వర్క్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ కనబడలేదు. అయితే కంటెంట్ బాగుంటే, ఎమోషన్స్ డ్రామా బాగా ఎలివేట్ అయితే ఆడియన్స్ ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. ఇక రజాకార్ సినిమాను సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్ లో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించగా, యాట సత్యనారాయణ డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో బాబీ సింహ, ప్రేమ, వేదిక, ఇంద్రజ, అనసూయ, మకరంద్ దేష్పాండే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు సుద్దాల అశోక్ తేజ రాయడం జరిగింది. ఇక రజాకార్ సినిమాను మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు