Telugu Anchor : గంజాయి కొట్టి ఈవెంట్ కి డుమ్మా.. యాంకరమ్మ భాగోతాలు అన్నీ ఇన్నీ కావు

Telugu Anchor : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ విభాగానికి సంబంధించి అయినా కూడా నిలబడటం అనేది అసాధ్యమైన పని. చాలామంది ఏదో సాధిద్దామని ఇండస్ట్రీకి వచ్చి నానా కష్టాలు పడుతుంటారు. తీరా అవకాశాలు వచ్చాక వచ్చిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోరు కొంతమంది. అవకాశాలు లేక చాలామంది బయట రోడ్డు మీద తిరుగుతున్నారు. ఒక్క అవకాశం వస్తే చాలు పేరు నిలబెట్టుకుందాం అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

యాంకర్ గా ప్రయాణం

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొంతమంది యాంకర్స్ ఉన్నారు. సినిమాల ప్రమోషన్స్ సందర్భంగా ఆ సినిమా టీం ని ఇంటర్వ్యూ తీసుకొని అక్కడ నుంచి ఫేమస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా రీసెంట్ టైమ్స్ లో ఒక యాంకర్ సినిమా వాళ్ళని ఇంటర్వ్యూస్ తీసుకొని బాగా ఫేమస్ అయింది. అయితే మెల్లమెల్లగా ఇంటర్వ్యూస్ తో పాటు ఈవెంట్స్ కూడా రావడం మొదలయ్యాయి. చాలా ఈవెంట్స్ కి యాంకర్ గా కూడా ఆమె హాజరైంది. రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ ఈవెంట్స్ కి ఆవిడే హోస్టుగా వ్యవహరిస్తుంది.

పెళ్లి కూడా ఎక్కువకాలం నిలవలేదు

ఈ యాంకరమ్మ పెళ్లి చేసుకుంది. కానీ, ఆ పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. కారణాలు ఏంటో తెలిదు కానీ, పెళ్లి పెటాకులు మాత్రం అయింది. దీని తర్వాత ఈ మధ్య కాలంలోనే సీక్రెట్ గా రెండో మ్యారేజ్ చేసుకుందని ఓ టాక్ కూడా వచ్చింది. ఇలాంటి వాటి వల్ల ఎప్పుడో క్లిక్ కావాల్సిన ఈ యాంకరమ్మ.. ఇప్పుడిప్పుడు ఫామ్ లోకి వస్తుంది.

- Advertisement -

మత్తులో ఈవెంట్ డుమ్మా కొట్టింది

రీసెంట్ గా ఒక సినిమాకు సంబంధించిన ఈవెంట్ కి హోస్ట్ గా ఆవిడను మాట్లాడారు. అయితే ఈవెంట్ చేయాల్సిన టైం కి స్పృహలో లేకుండా గంజాయి మత్తులో పడుకున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో అప్పటికప్పుడు ఆ మూవీ టీం కి ఏం చేయాలో తెలియక హడావిడిగా మరో యాంకర్ ను మాట్లాడుకుని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఈ విషయం కొంచెం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మళ్లీ తన ప్రయాణాన్ని మొదలుపెడితే సక్సెస్ఫుల్ కెరియర్ ని చూడొచ్చు అనేది కొంతమంది అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు