Jr NTR : నందమూరి ఫ్యామిలీలో ముదిరిన వివాదం… టచ్ కూడా చేయలేరు అంటూ ఎన్టీఆర్‌కు మాస్ వార్నింగ్.

Jr NTR : నటసార్వభౌమ నందమూరి ఎన్టీ రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడు గానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా తెలుగుజాతికి ఎంతో సేవలు చేసి తెలుగు ప్రజల గుండెల్లో ఇప్పటికి కొలువై ఉండిపోయారు. తెలుగు జాతిని తెలుగుజాతి కీర్తిని శిఖరం మీద కూర్చుని పెట్టిన ఘనత ఈయనకు దక్కుతుంది. ఇకపోతే ఈ లెగసిని ప్రస్తుత కాలంలో కంటిన్యూ చేస్తున్నది కేవలం ఎన్టీఆర్ మాత్రమే అనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఒక క్రికెట్ టీం కి ప్లేయర్స్ ఉన్నట్లు, ఈ ఫ్యామిలీలో కూడా అలానే ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఈ ఫ్యామిలీలో కరెక్ట్ గా సెట్ అయింది మాత్రం ఎన్టీఆర్.

ఎన్టీఆర్ ప్రస్థానం

నిన్ను చూడాలని సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఊహించిన విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా మంచి హిట్ అయింది. ఆ తర్వాత వివి వినాయక్ చేసిన ఆది. ఆ తర్వాత రాజమౌళి చేసిన సింహాద్రి యమదొంగ వంటి సినిమాలు ఎన్టీఆర్ కెరియర్ లో మంచి హిట్ అయ్యాయి. తర్వాత చాలామంది దర్శకులుతో సినిమాలు చేసి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీ అంతట్లో కూడా ఎన్టీఆర్ కి మంచి క్రేజ్ ఉంది.

Nandamuri Chaitanya Krishna Breathe

- Advertisement -

నందమూరి చైతన్య కృష్ణ

అప్పట్లో దం అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు చైతన్యకృష్ణ. ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేసే ప్రయత్నం చేయలేదు చైతన్య. ఇక రీసెంట్ గా బ్రీత్ అనే సినిమాను చేసాడు. ఈ సినిమా ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా ఎవరికి తెలియదు. ఓటిటిలో కూడా ఈ సినిమాను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఈ సినిమా పైన చాలా ట్రోల్ వేసారు.

నందమూరి చైతన్య కృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్

ఇకపోతే నందమూరి చైతన్య కృష్ణ కి ఎన్టీఆర్ కి మధ్య విభేదాలు ఉన్నాయి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కూడా ఒకప్పుడు పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఇకపోతే ఎన్టీఆర్ కూడా మెల్లగా తన పని తాను చేసుకుని ముందుకు వెళ్లిపోతున్నాడు. ఈ తరుణంలో నందమూరి చైతన్య కృష్ణ ఫేస్బుక్ వేదికగా ఒక వార్నింగ్ ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇస్తున్నాను ప్రత్యేకంగా వైఎస్ఆర్సిపి పార్టీకి కొడాలి నాని కి వల్లభనేని వంశీకి మీరు సపోర్ట్ చేస్తున్న అంటున్నారు. మీరెవరు మా బొచ్చు కూడా పీకలేరు నేనుండగా చంద్రబాబు నాయుడు మామయ్య నందమూరి బాలకృష్ణ బాబాయ్ టచ్ కూడా చేయలేరు నా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైయస్సార్సీపి కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు జాగ్రత్తగా ఉండండి అంటూ వార్నింగ్ ఇచ్చారు.

వార్నింగును కామెడీ చేసేసారు

ఇకపోతే నందమూరి చైతన్య కృష్ణ సినిమాలు లానే, ఈ వార్నింగ్ ను కామెడీ చేసేసారు. ఈ వార్నింగ్ తో మీమ్స్ కూడా మొదలయ్యాయి. చాలామందికి ఇది ఫేక్ ఆ ఒరిజినల్ ఆ అనే అనుమానం కూడా మొదలైంది. అయితే ఇది సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్లో ఈ పోస్ట్ ను రాసుకొచ్చాడు చైతన్య. అయితే చాలా తక్కువ మంది సపోర్ట్ గా మాట్లాడితే ఎక్కువ మంది ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు