Remuneration: నటీనటులు పారితోషకం తగ్గించుకోవాలి.. డిమాండ్ ఒప్పుకుంటారా..?

Remuneration.. ఈ మధ్యకాలంలో సినిమా బడ్జెట్ల విషయం పక్కన పెడితే.. అందులో నటించే నటీనటుల పారితోషకాలే ఎక్కువగా ఉన్నాయి.. అందుకే ఒకప్పుడు తక్కువ బడ్జెట్ తోనే సినిమాలు విడుదల అయ్యి.. భారీ విజయాలను సొంతం చేసుకునేవి.. కానీ ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నా .. పెట్టిన బడ్జెట్ వెనక్కి వస్తుందా అన్న ఆందోళన నిర్మాతలలో ఎక్కువ అవుతుంది.. ఈ నేపథ్యంలోనే నటీనటులు తమ పారితోషకాలను తగ్గించుకోవాలని చిత్ర పంపిణీదారుల సంఘం విజ్ఞప్తి చేసింది.. ది మధురై, రామనాథపురం యునైటెడ్ ఫిలిం డిస్టిబ్యూటర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం తాజాగా జరగగా.. ఈ సంఘం 2024 – 2026 సంవత్సరాలకు గానూ కొత్త కార్యవర్గం ఎంపికయింది.. సంఘం గౌరవ అధ్యక్షుడిగా జీ.ఎన్.అన్బుచెళియన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కొత్త సంఘం కండిషన్స్..

Remuneration: Actors should reduce their remuneration.. Will they agree to the demand..?
Remuneration: Actors should reduce their remuneration.. Will they agree to the demand..?

ఇక ఈ సంఘానికి అధ్యక్షుడిగా అళగర్ స్వామి , సహాయ కార్యదర్శిగా ఆర్థామస్ కోశాధికారిగా ఆర్. ఎమ్ .మాణిక్యం, కార్యదర్శిగా సాహుల్ , ఉపాధ్యక్షుడిగా కె.ఆర్ ప్రభాకర్, కార్యవర్గ సభ్యులుగా సి కాళేశ్వరన్, కే వెంకటేశన్, జీ. గుణశేఖరన్, ఎల్ శేఖర్ ఎస్పీ సెల్వ, ఆర్. రమేష్, ఏ. ఆర్. ఎస్. మనీ, ఆర్ ఎం వీరప్పన్, వి. జ్ఞానదేశికన్ తదితరులు ఎంపికయ్యారు.. ఇందులో కొన్ని తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది.. ఇకపోతే ఏకగ్రీవమైన తర్వాత ప్రధానంగా నటీనటులు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని కోరారు.. అంతేకాదు కొత్త సినిమా విడుదలైన ఆరు వారాల తర్వాతనే ఆ సినిమాను ఓటీటీ లకు ఇవ్వాలని కూడా కోరారు..

నటీనటుల పారితోషకం తగ్గించుకోవాలి..

ఇక రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లకు విధిస్తున్న ఎనిమిది శాతం కాంపౌండ్ కూడా పూర్తిగా రద్దు చేయాలని తీర్మానించడం జరిగింది.. అంతేకాదు ఈ కార్యక్రమంలో పలు అంశాలను కూడా వారు ఏకగ్రీవంగా ఆమోదించడం గమనార్హం.. ఇక ఇక్కడ ప్రత్యేకించి పారితోషకం విషయాన్ని మాత్రమే బాగా హైలైట్ చేయడం ఇప్పుడు నటీనటుల్లో కొత్త ఆలోచనలకు దారితీస్తోంది. మరి ఈ సంఘం యొక్క ఆదేశాలను నటీనటులు ఎంతవరకు పాటిస్తారు అన్నది కూడా సందేహంగా మారింది.. ఎందుకంటే టాలీవుడ్ లో కూడా మొన్నా మధ్య ఇలాంటి హడావిడే జరిగింది.. ఒక పది రోజులపాటు షూటింగ్స్ కూడా బంద్ చేశారు.. అయినా సరే ఎవరూ కూడా తమ పారితోషకాల విషయంలో తగ్గలేదు.. ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోయింది ..

- Advertisement -

టాలీవుడ్ నటీనటులు లాగే కోలీవుడ్ నటీనటులు కూడా సైలెంట్ అవుతారా..

మరి ఇప్పుడు కొత్త సంఘం ఏర్పడింది.. కోలీవుడ్ నటీనటులు కూడా పారితోషకం తగ్గించుకోవాలని డిమాండ్ చేసింది ఈ కొత్త సంఘం. మరి టాలీవుడ్ హీరోల లాగా కాకుండా వీరు సంఘం యొక్క కండిషన్లను పాటిస్తారా? లేక టాలీవుడ్ హీరోల లాగే ఎవరికి వారు తమ పారితోషకం విషయంలో తగ్గకుండా ఉంటారా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.. మొత్తానికైతే కోలీవుడ్ లో ఇప్పుడు ఏం జరగబోతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ప్రస్తుతం తలైవా రజినీకాంత్, విజయ్ దళపతి లాంటి హీరోలు ఒక్కో సినిమాకు రూ.170 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. టాలీవుడ్ హీరోల కంటే కూడా వీరి పారితోషకం ఎక్కువగా ఉండడం గమనార్హం .ఇంత పారితోషకం తీసుకుంటే బడ్జెట్ కేటాయింపుకి నిర్మాతలు మరింత ఇబ్బంది పడాల్సి వస్తోంది.. అందుకే బడ్జెట్ తగ్గించడానికి సినిమా నటీనటులు పారితోషకం తగ్గించుకోవాలని కూడా కోరుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు