Valentine’s Day: దేవరకొండ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ… నాలుగేళ్ల బాధను బయట పెట్టిన యంగ్ హీరో

 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చి, ఇప్పటికీ అదే ఐడెంటితో హీరోగా ఛాన్స్ లు తెచ్చుకుంటున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇటీవల ఈ యంగ్ హీరోకు బేబి సినిమాతో ఓ బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ చాలా మంచి గుర్తింపు వచ్చింది. కానీ, ఆ హిట్ క్రెడిట్ ఈ యంగ్ హీరోకు పెద్దగా దక్కలేదు. డైరెక్టర్ సాయి రాజేష్, హీరోయిన్ వైష్ణవి చైతన్యలకు కెరీర్ పరంగా ఈ మూవీ చాలా హెల్ప్ అయింది.

కానీ, ఆనంద్ దేవరకొండ కెరీర్ కు బేబి సినిమా పెద్దగా హెల్ప్ అవ్వలేదనే చెప్పొచ్చు. కాగా, బేబి సినిమాలో ఈ యంగ్ హీరో లవ్ ఫెయిల్యూర్ గా చాలా నేచురల్ గా కనిపించాడు. అయితే, ప్రస్తుతం వాలెంటైన్స్ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన లవ్ గురించి, లవ్ ఫెయిల్యూర్ గురించి పలు విషయాలను పంచుకున్నాడు ఆనంద్ దేవరకొండ.

- Advertisement -

చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిని ఈ యంగ్ చాలా పిచ్చిగా ప్రేమించడాట. ఆమె విదేశాలకు వెళ్లి చదువుకుంటే.. ఆనంద్ దేవరకొండ కూడా విదేశాలకు వెళ్లాడట. అప్పుడు ఆనంద్ ప్రేయసి.. పై చదువుల కోసం చికాగో వెళ్లిందట. అప్పుడు ఆనంద్ దేవరకొండ కూడా చికాగోలో టాప్ 5 కాలేజీల్లో అప్లే చేస్తే… ఒక కాలేజీలో సీటు రావడంతో ఆనంద్ దేవరకొండ చికాగో కి వెళ్లిపోయాడట. అమ్మాయి కోసం సముద్రాలు దాటిన తర్వాత తాను మోసపోయినట్టు తెలుసుకున్నాడట.

అక్కడికి వెళ్లిన తర్వాత అమ్మాయి గురించి, లవ్ గురించి వాస్తవాలు తెలియడంతో తిరిగి ఇంటికి వచ్చేశాడట. ఈ బ్రేకప్ నుంచి బయట పడటానికి ఆనంద్ దేవరకొండకు నాలుగు నుంచి ఐదేళ్లు టైం పట్టిందనిఓ ఆయన ఓ సందర్భంలో వెల్లడించాడు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు