Ruhani Sharma : దీంట్లో నైనా ఫుల్ లెంగ్తా ? లేక సైడ్ రోలేనా?

Ruhani Sharma As Tanya sharma

టాలీవుడ్ లో “చి.ల.సౌ” అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి యువతను గిలిగింతలు పెట్టి అట్రాక్ట్ చేసిన హీరోయిన్ రుహని శర్మ. చేసింది తక్కువ సినిమాలే అయినా తన గ్లామర్ తో ఆకట్టుకుంది. పెర్ఫార్మన్స్ రోల్స్ తో పాటు ఏ పాత్ర ఇచ్చినా చేయడానికి తాను రెడీ అంటూ పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పిన అయితే ఈ భామకు టాలెంట్ ఉన్నా హిట్లు మాత్రం కరువయ్యాయి. అయినా పట్టువదలకుండా మంచి సినిమాల అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉంది.

అయితే రీసెంట్ గా వెంకటేష్ సైన్ధవ్ సినిమాలో కీ రోల్ లో నటించింది. ముందుగా రుహాణి శర్మ ఆ సినిమాలో మెయిన్ లీడ్ అని ప్రచారం జరిగినా, వేరే హీరోయిన్ ఆ రోల్ ని భర్తీ చేసింది. ఇక కీ రోల్ చేసిన ఆ పాత్రకు కూడా పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. అలాంటప్పుడు సైడ్ రోల్ చేసి ఏం ప్రయోజనం. అయితే ఇప్పుడు మరో సినిమాలో కూడా సైడ్ రోల్ లోనే కనిపంచబోతుందని సమాచారం. వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ లో రుహాని శర్మ తాన్యా శర్మ అనే పాత్రలో కీ రోల్ ప్లే చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేయడం జరిగింది.

- Advertisement -

అయితే సైన్ధవ్ లో కీ రోల్ చేసినా ఆ పాత్ర రుహాని శర్మ కి పెద్దగా ఉపయోగపడలేదు. ఇప్పుడు వరుణ్ మూవీ లో కూడా సైడ్ రోలే చేసింది. కానీ ఈ సినిమాలోనైనా తన పాత్రకి ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటేనే రుహని శర్మ చేసినదానికి ఏదైనా ప్రయోజనం ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక నెటిజన్లయితే ఆఫర్లు లేక గత్యంతరం లేక సైడ్ రోల్సే చేయాల్సిన అవసరం వచ్చిందేమోనని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా గ్లామర్ ఉండి టాలెంట్ ఉన్నా, స్క్రిప్ట్ సెలక్షన్ లో చురుకుదనం చూపించకపోతే హీరోయిన్ గా నిలబడటం కష్టం. రుహని శర్మ ఈ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిదని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు