Upendra : ఏ ధైర్యంతో చేస్తున్నారు కబ్జా -2 ?

గతకొన్ని రోజులుగా తెలుగులో కన్నడ డబ్బింగ్ సినిమాల హావా ఎక్కువైంది. KGF సినిమాతో తెలుగులో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది.కానీ KGF మినహా ఏ సినిమా తెలుగులో ఆడలేదు. కొన్ని సినిమాలకైతే డబ్బింగ్ ఖర్చులు కూడా మిగలలేదు. సినిమాలో మ్యాటర్ ఉంటె పార్ట్-2 ఏ కాదు, ఎన్ని పార్ట్ లుగా తీసిన జనాలు చూస్తారు. కానీ అట్టర్ డిజాస్టర్ అయినా సినిమాకి కూడా పార్ట్ 2 తీయడం వాళ్ళ వచ్చే క్రెడిట్ డైరెక్టర్ ఆర్. చంద్రు కె దక్కుతుంది. ఆర్ చంద్రు ఎవరో కాదు ఈ మధ్యనే వచ్చిన కబ్జా సినిమా డైరెక్టర్.

గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని ఎదో హాలీవుడ్ సినిమా చూస్తూ ఇలాగె రాయాలి అని అనుకోని ఒరిజినల్ ఎలా ఉందొ అలాగే రాసేస్తాడు. ఆర్ చంద్రు వ్యవహారం ఇంచు మించు ఇలాంటిదే , మరి KGF సినిమా చూసాక కబ్జా రాసుకున్నాడో , లేక ఆయన కబ్జా రాసుకున్నాక KGF వచ్చిందో తెలీదు గాని కేజిఫ్ మేకింగ్ ని మక్కికి మక్కి దించేసాడు.ఫలితంగా సినిమా బాక్స్ ఆఫీస్ ముందు అతి పెద్ద డిజాస్టర్ గ నిలిచింది

తెలుగులో ఉపేంద్ర కి మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే ఖచ్చితంగా సినిమా చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఈ దైర్యం తోనే కబ్జా ని కన్నడ తో పాటు అన్ని సౌత్ ఇండియన్ భాషల్లోను రిలీజ్ చేసారు , తెలుగు ప్రేక్షకులకి కబ్జా అస్సలు నచ్చలేదు. డే  1కే సినిమాని థియేటర్స్ నుంచి తీసేసారు.  ఒక్క తెలుగు లోనే కాదు రిలీజ్ చేసిన అన్ని భాషల్లోనూ సినిమా డిజాస్టర్ అయింది.

- Advertisement -

అయితే దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 40 కోట్ల వసూళ్ళని రాబట్టి అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా పార్ట్ 2 ని చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట ఆర్ చంద్రు. హిట్ అయినా సినిమా పార్ట్ -2 చేయడం కామన్ ప్లాప్ అయినా సినిమా కి పార్ట్ -2 చేయడమే వైరటీ అన్న తరహాలో కబ్జా మేకర్స్ ఉన్నారు. మరి ఈ సినిమా అయినా హిట్ అవుతుందో లేదో చూడాలి.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు