Ravibabu: పూర్ణతో ఎఫైర్ ఉంది.. కానీ ?

ప్రముఖ నటి పూర్ణ, నటుడు రవిబాబులది టాలీవుడ్‌లో హిట్ కాంబినేషన్ అన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలలో పూర్ణ ప్రధానంగా నటించేది. వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు నాలుగో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ కాంబినేషన్ లో “అసలు” అనే సినిమా తెరకెక్కగా.. ఈ సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందనే వార్తలు అప్పట్లో చాలా వినిపించాయి. ఇన్నాళ్ళకి ఈ రూమర్స్ పై స్పందించారు రవిబాబు.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రవిబాబు మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. “పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంది” అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. అలా అన్నానని ఇంకేదో అనుకునేరు.. ప్రతి దర్శకుడికి తన నటులతో అలాంటి అనుబంధమే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇలాంటి అనుబంధం ఉండటం వల్లే నటులతో మంచి నటన రాబట్టుకోగలుగుతామని, వారు మంచి అవుట్ పుట్ ఇస్తారనేది రవిబాబు ఉద్దేశం. దర్శకుడు చెప్పిన దానికంటే నటులు 10 – 20 % ఆడ్ చేసి నటిస్తుంటారు. కానీ పూర్ణ 200% ఆడ్ చేస్తోంది అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

“నా సినిమాలో హీరోయిన్ ని ఎంపిక చేయాలని భావిస్తే మొదట పూర్ణ గుర్తుకు వస్తుంది” అని తెలిపారు. అయితే పూర్ణ అన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదన్నారు రవిబాబు. ఇటీవల తన కొత్త సినిమా “వాషింగ్ మెషిన్” కోసం పూర్ణని సంప్రదిస్తే నిర్మొహమాటంగా చేయనని చెప్పిందట. ఆమె ఓ పాత్రకి నేను కరెక్ట్ అనుకుంటేనే నటిస్తుందని.. లేదంటే నో చెప్పేస్తుందని అన్నారు. తమ కాంబినేషన్ లో నాలుగు సినిమాలు వచ్చాయని.. సహజంగా ఎక్కువ సినిమాలు చేయడంతో ఇలాంటి ఎఫైర్ వార్తలు వినిపిస్తూ ఉంటాయని చెప్పుకొచ్చారు. కానీ అందులో నిజం లేదని వెల్లడించారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు