Allari naresh: జోరుగా ఉగ్రం ప్రమోషన్స్

అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ” ఉగ్రం “. ఇంటెన్స్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మే 5 న విడుదలకి సిద్ధమైంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతం లో వచ్చిన నాంది సూపర్ హిట్ అయి, నరేష్ కి సెకండ్ ఇన్నింగ్స్ లో మొదటి హిట్ గా నిలిచింది. అప్పటిదాకా కామెడీ సినిమాకే పరిమితం అయినా నరేష్.. నాంది తో సీరియస్ సినిమాలపై దృష్టి పెట్టారు.

అయితే ఉగ్రం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నరేష్ ఇటీవల మల్లారెడ్డి కాలేజ్ కి వెళ్లారు. అక్కడ స్టూడెంట్స్ తో మాట్లాడుతూ ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసిన చిత్రమని.. తప్పకుండ మీ అందరికి నచ్చుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. విజయ్ కనకమేడల గురించి ఆయన మాట్లాడుతూ ప్రతి యాక్టర్ కి అన్ని రకాల పాత్రలు చేయాలనీ ఉంటుంది. కానీ ఆ పాత్ర మేం చేయగలుగుతాం అని నమ్మే విజయ్ లాంటి డైరెక్టర్ ఉంటే తప్పకుండ అవుట్ ఫుట్ ఉగ్రంలాగ వస్తుంది అని ఆయన అన్నారు.

షైన్ స్క్రిన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కెరీర్ లోనే హై బడ్జెట్ తో వస్తోన్న సినిమా ఇది. ఇప్పటిదాకా నరేష్ ని కామెడీ పోలీస్ గా చుసిన ప్రేక్షకులకి ఈసారి నరేష్ ని సీరియస్, అగ్రెస్సివ్ పోలీస్ ఆఫీసర్ గా చూస్తారని డైరెక్టర్ విజయ్ అన్నారు. ఇంతవరికి ఎవరు చెప్పని ఒక యూనిక్ పాయింట్ ఒకటి సినిమా ద్వారా చెప్పబోతున్నామని అది ప్రేక్షకులకి రివీల్ అయినపుడు తప్పకుండ సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు అని ఆయన చెప్పుకొచ్చారు. నరేష్ కి జోడిగా ఈ సినిమాలో మలయాళ బ్యూటీ మిర్న మీనన్ నటిస్తుంది. అబ్బూరి రవి మాటలు అందిస్తున్న ఈ సినిమాకి సంగీతం శ్రీ చరణ్ పాకాల. ఇప్పటికే రిలీజ్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో సినిమా ఫలితంపై యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు