Game Changer : అందరూ రెడీ.. కానీ ఈసారి అసలు వాడే హ్యాండిచ్చాడు?

Game Changer : టాలీవుడ్ లో ఈ మధ్య వాయిదాల పర్వం అనే పదానికి డెఫినేషన్ గా మారిపోయింది “గేమ్ చేంజర్” సినిమా. ఏడాది కాలంగా వాయిదా పడుతూనే వస్తుంది ఈ సినిమా. శంకర్ షణ్ముగం దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. సినిమాకి ఒకరంటే ఒకరు లేని పరిస్థితి వస్తుంది. షూటింగ్ విషయాల్లో ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. ఈ సినిమాని దిల్ రాజు ఎంతో ప్రణాళికతో మొదలుపెట్టినప్పటికీ కూడా ఊహించిన విధంగా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. సాధారణంగా దిల్ రాజు ఎలాంటి సినిమా మొదలుపెట్టిన కూడా పక్క ప్లానింగ్ తోనే ఫినిష్ అవుతూ ఉంటుంది. పైగా బడ్జెట్ విషయంలో కూడా ఆయన పెట్టుకునే పరిమితులు అన్ని ఇన్ని కావు. దర్శకులకు ముందుగానే తన ప్లానింగ్ గురించి వివరణ ఇస్తారు. అయితే శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో మాత్రం దిల్ రాజు ఎన్ని ప్రణాళికలు రచించిన కూడా సరైన పద్ధతిలో అయితే వెళ్లడం లేదు. అందుకు కారణం దర్శకుడు సడన్ గా మధ్యలో ఇండియన్ 2 సినిమాను మొదలు పెట్టడం అని తెలిసందే. ఆగిపోయిన ఈ సినిమాను పూర్తి చేయాల్సిన పనిపెట్టుకోవడంతో దెబ్బ గేమ్ ఛేంజర్ కు పడింది.

Ram charan Game Changer next schedule update

చరణ్ కూడా హ్యాండ్ ఇవ్వాల్సిన పరిస్థితి?

ఇదిలా ఉండగా ఇండియన్2 తో పాటు పార్ట్3 కూడా తెరకెక్కుతుండటం వల్ల, గేమ్ ఛేంజర్ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. దిల్ రాజు కూడా చేసేదిమీ లేక చాలాసార్లు శంకర్ ఎప్పుడు క్లారిటీ ఇస్తే అప్పుడు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఉంటుంది అని ఓపెన్ గా చెప్పేసారు. ఇక మొత్తానికి ఇటీవల ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో విడుదల చేయాలి అని మరొక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అయితే అందుకు తగ్గట్టుగా షూటింగ్ పనులు పూర్తి చేయాలని అనుకున్నా కుదరడం లేదు. ఏది ఏమైనా జూన్ చివరిలోపు చాలావరకు షూటింగ్ పనులను పూర్తి చేయాలని అందరి డేట్స్ కూడా అడిగి తీసుకున్నారు. అయితే అందరూ రెడీగా ఉన్నారనుకున్న టైంలో ఊహించిన విధంగా మరొక ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు రామ్ చరణ్ అందుబాటులో లేడని తెలుస్తోంది. ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. మరొకవైపు చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త సినిమాలు మొదలుపెట్టబోతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఎలాగైనా పూర్తి చేయాల్సిందే?

ఇక తాజాగా చరణ్ తన ఫ్యామిలీ వెకేషన్స్ లో చాలా బిజీగా ఉన్నాడు, కాబట్టి ఇప్పుడు చరణ్ లేటెస్ట్ షెడ్యూల్లో పాల్గొనే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో సినిమా షూటింగ్ మళ్లీ వాయిదా పడ్డట్టు టాక్ వినిపిస్తోంది. ఇక శంకర్ కూడా చేసేది ఏమీ లేక ప్రస్తుతం ఇండియన్ 2 ప్రాజెక్టు కు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొనాలని చూస్తున్నాడు. కానీ ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ (Game Changer) ని జులై కల్లా పూర్తి చేయాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే బడ్జెట్ అనుకున్నదానికన్నా ఎక్కువ పెరిగిపోయింది. అందుకే దిల్ రాజు మాత్రం చరణ్ తో మాట్లాడి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా చేయాలని చర్చిస్తున్నట్లు సమాచారం. మరి చరణ్ షూటింగ్ లోకి ఎప్పుడు వస్తాడో చూడాలి. ఇక గేమ్ ఛేంజర్ బడ్జెట్ ఇప్పటికే 250 కోట్లు దాటిపోగా మూడొందలు దాటే అవకాశం కనిపిస్తుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు