Hanuman OTT Update : “హనుమాన్” రాక ఆలస్యం… అభిమానుల ఆగ్రహం

2024 సంక్రాంతికి చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది హనుమాన్. అయితే మూవీ వచ్చి నెలలు గడిచిపోతున్నా ఇంకా ఓటీటీలోకి రాకపోవడంపై హనుమాన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆ మూవీ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న ఓటిటి ప్లాట్ ఫామ్ జీ5పై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. మరి ఇంతకీ హనుమన్ రాక ఎప్పుడు? జీ5 వాళ్ళు ఏమంటున్నారు? అనే వివరాల్లోకి వెళ్తే…

“హనుమాన్” రాక ఆలస్యమే…
తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఒకేసారి థియేటర్లలోకి వచ్చిన హనుమాన్ కు తెలుగులో మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోటీ తప్పలేదు. ఇక్కడ పరిస్థితి గుంటూరు కారం వర్సెస్ హనుమాన్ అన్నట్టుగా తయారయింది. అలాగే చిన్న సినిమాకు థియేటర్లు ఇవ్వట్లేదు అన్న సింపతి కూడా హనుమాన్ కు కలిసి వచ్చింది. గుంటూరు కారం తీవ్ర నెగెటివిటీ కారణంగా యావరేజ్ టాక్ తెచ్చుకోగా, హనుమాన్ కుటుంబ సమేతంగా కలిసి చూడగలిగే చిత్రం కావడంతో సంక్రాంతికి అందరూ ఈ మూవీకే ఓటు వేశారు. ఫలితంగా 50 కోట్ల తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ దాదాపు 300 కోట్లు కొల్లగొట్టి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. థియేటర్లో దాదాపు నెలరోజుల దాకా మంచి ఆక్యుపెన్సితో నడిచి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీ ఓటిటి ఎంట్రీ గురించి అప్పటి నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు అభిమానులు. రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అన్న రూమర్లే తప్ప ఇప్పటిదాకా ఓటిటి లోకి వచ్చిందే లేదు ఈ మూవీ. ఎట్టకేలకు మహాశివరాత్రి కానుకగా హనుమాన్ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది అని గత వారమే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.

ఇప్పుడేమో ప్లేట్ ఫిరాయించిన జీ5…
హనుమాన్ మూవీ మార్చ్ 8న ఓటీటీలోకి వస్తుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన జీ5 రిలీజ్ కి కొన్ని గంటల ముందు నుంచి దీనిపై సమాచారం లేదంటూ ఆడియన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. చాలామంది శివరాత్రి రోజు హనుమాన్ వంటి డివోషనల్ టచ్ ఉన్న మూవీని ఫ్యామిలీతో కలిసి ఓటిటిలో చూసేద్దామని ఈగర్ గా వెయిట్ చేశారు. సోషల్ మీడియాలో జీ5 ఓటీటీని ట్యాగ్ చేస్తూ గురువారం అర్ధరాత్రి నుంచి వరుసగా ట్వీట్లు వేయడం స్టార్ట్ చేశారు. కానీ జీ5 మాత్రం “మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. ప్రస్తుతం దీనిపై మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. అప్డేట్స్ కోసం మా సోషల్ మీడియా, వెబ్ సైట్ ను చూస్తూ ఉండండి” అనే సమాధానంతో సరిపెట్టేసింది. దీంతో ప్రేక్షకుల అసహనం ఆకాశాన్ని తాకింది. ఈ మూవీని ఇంకెంతకాలం వాయిదా వేస్తారంటూ తమ కోపాన్ని డైరెక్ట్ గా ఆ మూవీని కొన్న జీ5పై వెళ్లగకుతున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది అన్నదానిపై క్లారిటీ లేదు. మరి హనుమాన్ ఓటీటీ రిలీజ్ విషయంలో జి5 నుంచి ఎప్పుడు సరైన సమాధానం వస్తుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు