C Space : ఇండియాలోనే ఫస్ట్ గవర్నమెంట్ ఓటిటి… కానీ తెలుగు వాళ్లకు నిరాశే

ప్రస్తుతం ఇండియాలో నడుస్తున్న పాపులర్ ఓటిటి ప్లాట్ఫామ్స్ లిస్ట్ లో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో పాటు ఆహా వంటి మరికొన్ని చిన్నచిన్న ఓటిటిలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి ఏకంగా ఓ గవర్నమెంట్ ఓటిటి ప్లాట్ఫామ్ వచ్చి చేరింది. సాధారణంగా ప్రస్తుతం ఉన్న పాపులర్ ఓటిటి ప్లాట్ఫామ్స్ అన్ని కార్పొరేట్ సంస్థల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ముఖ్యంగా వాల్ట్ డిస్నీ రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు చాలా వరకు ఓటిటి యాప్స్ ను రన్ చేస్తున్నారు. అయితే మొట్టమొదటిసారిగా ఇండియాలోని కేరళ ప్రభుత్వం సొంతంగా ఓటిటి ప్లాట్ ఫామ్ ను లాంచ్ చేయడం ఇప్పుడు సినీ ప్రియులకు సర్ప్రైజ్ గా మారింది. ఇంతకీ ఆ ఓటిటీ కథ ఏంటి? అని వివరాల్లోకి వెళితే…

సీస్పేస్ చాలా స్పెషల్…
ఈ మలయాళ ఓటిటి ప్లాట్ఫామ్ కు సీస్పేస్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇటీవలే ఈ యాప్ ను ప్రారంభించారు. కేరళ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సిస్పేస్ ఓటిటి యాప్ నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. అలాగే ఇందులో ఉండాల్సిన కంటెంట్, సినిమాల స్ట్రీమింగ్, రిలీజ్ వంటి విషయాల బాధ్యతను కేరళ కల్చరల్ మినిస్ట్రీ తీసుకుందని సమాచారం. ఈ యాప్ ను నిర్వహించడానికి 60 మందితో కూడిన స్పెషల్ బోర్డ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా, అందులో సన్నీ జోసెఫ్, సంతోష్ శివన్, బెన్యా మీనన్ వంటి సినీ ప్రముఖులు బోర్డు మెంబర్స్ గా సెలెక్ట్ అయినట్టు సమాచారం. అయితే ఈ ఓటిటి కేవలం మలయాళ ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అయ్యేలా ఉంది.

తెలుగు ప్రేక్షకులకు కష్టమే…
సాధారణంగా తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఆదరించినంతగా మరే ఇతర భాషల ప్రేక్షకులు ఎంకరేజ్ చేయరు అనేది సెలబ్రిటీల మాట. ఇక ప్రస్తుతం ఉన్న ఓటీటీల్లో కూడా తెలుగు సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉంటారు. కానీ సిస్పేస్ మాత్రం కేవలం మలయాళ సినిమాలకే అంకితం కానుంది. అందులో మలయాళ సినిమాలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు మిగతా ఓటిటిల లాగా ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉంటాయా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అలాగే ఈ ఓటిటి యాప్ పే ఫర్ వ్యూ అనే విధానంలో రన్ అవుతుంది. ఇందులో ఏదైనా సినిమా చూడాలంటే యూజర్ కచ్చితంగా 75 రూపాయలు చెల్లించాల్సిందే. ప్రస్తుతం సి స్పేస్ ఓటీపీ యాప్ లో 35 సినిమాలతో పాటు ఆరు డాక్యుమెంటరీలు ఒక షార్ట్ ఫిలిం ను రిలీజ్ చేశారు. అందులో సాదాసీదా సినిమాలు కాకుండా ఎక్కువ శాతం నేషనల్, స్టేట్ అవార్డులు గెలుచుకున్న సినిమాలకే అవకాశం దక్కింది.

- Advertisement -

ఇదే కేరళ గవర్నమెంట్ ఉద్దేశం…
సేస్పేస్ లో ఉంచబోయే సినిమాలు, డాక్యుమెంటరీలు షార్ట్ ఫిలిమ్స్ స్ట్రీమింగ్ కోసం డిఫరెంట్ ప్లాన్స్ ను ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కొత్త మేకర్స్ తో పాటు అవార్డు విన్నింగ్ సినిమాలను ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వం ఈ ఓటిటి యాప్ ను లాంచ్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం అని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ తో పాటు ఆపిల్ యూజర్లు కూడా సిస్పేస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఓటిటి యాప్ ద్వారా ఫిలిం మేకర్స్ కు ఎంత డబ్బులు వచ్చాయనే సమాచారాన్ని అందులోనే అఫీషియల్ గా ఉంచబోతున్నట్టు టాక్.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు