Hanuman OTT Update : “హనుమాన్” ఓటిటి డేట్ ఫిక్స్… ఎప్పుడంటే..?

Hanuman OTT Update : దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా “హనుమాన్” సందడే కనిపిస్తోంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా వరుసగా రికార్డులు క్రియేట్ చేస్తూ, రోజురోజుకూ మరింత జోష్ తో థియేటర్లలో దూసుకెళ్తోంది. త్వరలోనే 300 కోట్ల క్లబ్ లో చేరనున్న “హనుమాన్” మూవీ ఓటిటి రిలీజ్ డేట్, డిజిటల్ పార్ట్నర్ వంటి విషయాలపై ఇప్పుడు సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న “హనుమాన్” మూవీ ఓటీటిలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సూపర్ హీరో మూవీ ఓటింగ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం. మరి “హనుమాన్” మూవీ ఏ ఓటిటిలో, ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? అంటే…

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ “హనుమాన్”. సంక్రాంతి కానుకగా అంతర్జాతీయ భాషల్లో సైతం విడుదలైన ఈ చిన్న మూవీకి ఆడియన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. భారతీయ ప్రధాన భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, జపనీస్, చైనీస్ లాంటి అంతర్జాతీయ భాషల్లో సైతం పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ అయిన “హనుమాన్” బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటికే 250 కోట్ల భారీ కలెక్షన్లు కొల్లగొట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్న ఈ మూవీ ఓటిటి రైట్స్ ను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ జీ5 సొంతం చేసుకుంది. “హనుమాన్” మూవీ రైట్స్ ను అన్ని భాషల్లో కలిపి 16 కోట్లకు జీ5 సంస్థ కొనుగోలు చేసినట్టు సమాచారం. అందులో “హనుమాన్” తెలుగు వర్షన్ కు 11 కోట్లు, హిందీ వర్షన్ కు 5 కోట్లు వెచ్చించారని సమాచారం.

ఈ నేపథ్యంలోనే “హనుమాన్” ఓటిటి రిలీజ్ డేట్ ను జీ5 సంస్థ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రన్ పూర్తయిన మూడు వారాల తర్వాత “హనుమాన్” మూవీని ఓటిటిలో రిలీజ్ చేయాల్సింది. కానీ మూవీకి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ దృష్ట్యా థియేట్రికల్ రన్ ను మరో 55 రోజులు పొడిగించారని టాక్. “హనుమాన్” మూవీ రిలీజై ఇప్పటికీ 17 రోజులు కావస్తోంది. కానీ ఇంకా చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డ్ లతో పాటు, మంచి ఆక్యుపెన్సి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని “హనుమాన్” ఓటిటి స్ట్రీమింగ్ ను పొడిగించినట్లు తెలుస్తోంది. మార్చ్ 2 వారంలో “హనుమాన్” మూవీ ఓటిటిలో అందుబాటులోకి రానుంది. అయితే ఇంకా రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి “హనుమాన్” మూవీని ఓటిటిలో చూడాలంటే ఇంకా నెల రోజులకు పైగా వెయిట్ చేయక తప్పదు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు