Dil Raju : “దేవర” పోస్ట్ పోన్… “ఫ్యామిలీ స్టార్” రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన దిల్ రాజు

Dil Raju : సంక్రాంతి సినిమాల వివాదం తర్వాత ఇప్పుడు టాలీవుడ్ లో భవిష్యత్ సినిమాల రిలీజ్ డేట్ల విషయం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడు ఏ సినిమా పోస్ట్ పోన్ అవుతుందో, ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు “దేవర” పోస్ట్ పోన్ గురించి మాట్లాడుతూ, తను నిర్మిస్తున్న “ఫ్యామిలీ స్టార్” రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసేసారు. మరి “దేవర” నిజంగానే పోస్ట్ పోన్ కాబోతోందా? “ఫ్యామిలీ స్టార్” రాక ఎప్పుడు? అంటే…

కొరటాల శివ దర్శకత్వంలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీనీ ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ముందుగా మేకర్స్ ప్రకటించారు. కానీ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్, అలాగే షూటింగ్ లో అవాంతరాల కారణంగా ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంకా ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ అంతలోనే ఆ రూమర్లను బేస్ చేసుకుని “దేవర” పోస్ట్ పోన్ అయితే, తమ సినిమాను అదే రోజున రిలీజ్ చేయడానికి కాచుక్కూర్చున్నారు నిర్మాతలు.

ముఖ్యంగా ఆ తేదీని “ఫ్యామిలీ స్టార్” కబ్జా చేయాలని చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అంతలోనే ఆ వార్తలను నిజం చేస్తూ దిల్ రాజు “దేవర” పోస్ట్ ఫోన్ అయితే ఆ రిలీజ్ డేట్ మాదే అంటూ ఇతర నిర్మాతలకు క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ “దేవర” మూవీ ఒకవేళ పోస్ట్ ఫోన్ అయితే, ఏప్రిల్ 5న తను నిర్మిస్తున్న “ఫ్యామిలీ స్టార్” రిలీజ్ అవుతుందని ప్రకటించారు.

- Advertisement -

తాజాగా ఈగల్, ఊరు పేరు భైరవకోన సినిమాల రిలీజ్ డేట్ల వివాదం విషయమై సమావేశమయ్యారు నిర్మాతలు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తను హామీ ఇచ్చినట్టుగానే ఈ సమావేశం ద్వారా “ఈగల్”కు సోలో రిలీజ్ డేట్ ఇచ్చి లైన్ క్లియర్ చేశారు. ఇక ఫిబ్రవరి 9న రావాల్సిన “ఊరు పేరు భైరవకోన” నిర్మాతలకు నచ్చజెప్పి, ఫిబ్రవరి 16కు వాయిదా వేసుకునేలా చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో “ఊరు పేరు భైరవకోన” మూవీ పోస్ట్ పోన్ అయ్యిందన్న విషయాన్ని దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు.

అలాగే “దేవర” మూవీ పోస్ట్ పోన్ అయితే, ఏప్రిల్ 9న “ఫ్యామిలీ స్టార్” వస్తాడని క్లారిటీ ఇచ్చారు. ఇక విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా “ఫ్యామిలీ స్టార్” రిలీజ్ డేట్ పై కంప్లీట్ క్లారిటీ రావాలి అంటే, “దేవర” మేకర్స్ తమ సినిమా రిలీజ్ డేట్ గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేసేదాకా వెయిట్ చేయాల్సిందే.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు