Vijay Devarakonda : రౌడీ హీరో ఒక్కడే రావాలని చూస్తున్నాడా..?

టాలీవుడ్ లో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ ని సంపాదించిన ఈ హీరో కెరీర్ బిగినింగ్ లో ఎన్నో అవమానాల్ని ఎదుర్కొని ఈ రేంజ్ స్టార్ డమ్ ని సంపాదించాడు. ఇక లాస్ట్ ఇయర్ ఖుషి సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్ తో “ఫ్యామిలీ స్టార్” సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను 2024 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే సమ్మర్ లో సినిమా రిలీజ్ అంటే ఎంత పోటీ ఉంటుందో తెలిసిందేగా. సంక్రాంతికైనా, దసరా కైనా ఆ పండక్కి మాత్రమే సినిమాలు పోటీపడతాయి. కానీ సమ్మర్ రేస్ లో సినిమాలు దాదాపు రెండు నెలల పాటు గ్యాప్ లేకుండా చిన్న సినిమాల నుండి మీడియం రేంజ్, స్టార్ హీరోల సినిమాలు వరుస పెట్టి రిలీజ్ అవుతుంటాయి. అందుకే దిల్ రాజు చాలా ప్లానింగ్ తో ఫ్యామిలి స్టార్ ని ప్రేక్షకులదగ్గరికి తీసుకొచ్చే పనిలో ఉన్నాడని టాక్ నడుస్తుంది.

ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ఫ్యామిలీ స్టార్ ని సమ్మర్ మొదలయ్యే టైం లో అంటే మార్చ్ లోనే రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడని టాక్ నడుస్తుంది. అది కూడా పోటీ లేకుండా సోలో రిలీజ్ డేట్ కోసం ట్రై చేస్తున్నారట. అయితే మార్చ్ ఫస్ట్ వీక్ లో డబల్ ఇస్మార్ట్, బాలయ్య సినిమా రెండో వారంలో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అందుకే పోటీ లేకుండా ఫ్యామిలీ స్టార్ ని మార్చ్ మూడో వారంలో 22న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. పైగా ఆ తర్వాత వారంలో కూడా మరో సినిమా లేదు. ఎందుకంటే ఏప్రిల్ 5న దేవర రిలీజ్ ఉంది కాబట్టి, దానికి రేణు వారల ముందే ఫ్యామిలీ స్టార్ ని దింపి కలెక్షన్లు సోలో గా పిండుకోవాలని దిల్ రాజు చూస్తున్నాడని సమాచారం. మరి అఫిషియల్ గా ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు