Tollywood: విజయ్ దేవరకొండ పై అసభ్యకర వార్తలు.. తాట తీసిన సైబర్ క్రైమ్ పోలీసులు!

టాలీవుడ్ లో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ ని సంపాదించిన ఈ హీరో కెరీర్ బిగినింగ్ లో ఎన్నో అవమానాల్ని ఎదుర్కొని ఈ రేంజ్ స్టార్ డమ్ ని సంపాదించాడు. ఇక ఈ ఇయర్ ఖుషి సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్ తో “ఫ్యామిలీ స్టార్” సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను 2024 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ పై అప్పుడప్పుడు ఫేక్ న్యూస్ లు రావడం చూస్తూ ఉంటాం. ఇప్పుడు గత కొన్నాళ్లుగా ఈ హీరోకు కొంచెం ఆటిట్యూడ్ ఉందని, ఇండస్ట్రీ లో పెద్దలకు రెస్పెక్ట్ ఉండదని, ఇంకా చెప్పాలంటే పలానా హీరోయిన్లతో ఎఫైర్స్ ఉన్నాయని, ఇలా కొన్ని రకాల తప్పుడు వార్తలు ఓ యూట్యూబర్ ప్రచారం చేయడం జరిగింది.

తాజాగా ఇలా అసభ్యకర వార్తలు యూట్యూబ్ లో ప్రసారం చేసిన ఆ వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం ‘సినీ పోలీస్’ అనే యూట్యూబ్ ఛానల్ వేదికగా విజయ్ దేవరకొండను అవమానిస్తూ అసత్యపు వార్తను ప్రసారం చేశాడు. అతడు అనంతపురంకు చెందిన వెంకట కిరణ్ అనే వ్యక్తి. విజయ్ దేవరకొండ ఇమేజ్ ని కించపరిచే విధంగా ఉన్న ఆ వీడియో లు, ఇంకా విజయ్ ని తన సినిమాలలోని హీరోయిన్ లను కూడా అవమానిస్తూ చేసిన ఆ యూట్యూబ్ వీడియో లపై విజయ్ తో సినిమా చేస్తున్న మూవీ మేకర్స్ సదరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.

- Advertisement -

ఇక సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు వెంటనే స్పందించి సదరు వ్యక్తి ఆచూకీని తెలుసుకున్నారు. కేసు నెంబర్: 2590/2023 గా కేసును ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా కొన్ని గంటల వ్యవధిలోనే వెంకట్ కిరణ్ ని అరెస్ట్ చేశారు. ఇక అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వీడియోలనీ, ఛానల్ ని డిలీట్ చేయించారు. అంతేకాదు ముందు ముందు మళ్ళీ ఇలాంటి వీడియోలు చేయకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఇలా టార్గెటెడ్ గా సోషల్ మిడియా లో ఎవరు నెగిటివ్ వీడియోలు చేసినా వారిని అసభ్యంగా నిందిస్తూ తప్పుడు వీడియోలు చేసినా వ్యాఖ్యలు చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని సైబర్ పోలీసులు హెచ్చరించారు.

ఇక ఇంతకు ముందు కూడా సమంత, శ్రీ లీల పై కొంతమంది తప్పుడు వార్తలు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీ పై పర్సనల్ గా తప్పుడు వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ సునిశిత్ అనే వ్యక్తి ని రామ్ చరణ్ ఫ్యాన్స్ నడి రోడ్డుపై చితక్కొట్టగా, వెంటనే పోలీసులు కూడా అరెస్ట్ చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు