Tollywood: 2023 లో రీ ఎంట్రీ ఇచ్చి ఫెయిల్ అయిన డైరెక్టర్స్ వీళ్ళే!

టాలీవుడ్ లో చాలా మంది డైరెక్టర్లు హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తుంటారు. వాళ్లలో కొంత మంది సక్సెస్ అవుతారు. మరికొంత మంది సక్సెస్ అయి ఫేడ్ అవుట్ అయినా వాళ్ళు ఉంటారు. ఇంకొందరు ఫస్ట్ సినిమాతోనే ప్లాప్ ఇచ్చి ఆ తర్వాత హిట్ కొట్టిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక మరికొందరైతే ఇండస్ట్రీలో కం బ్యాక్ కోసం ఇంకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అలా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉన్నా 2023 లో ఎన్నో ఆశలతో రీ ఎంట్రీ ఇచ్చి ఫెయిల్ అయిన డైరెక్టర్లు ఎవరో తెలుసుకుందాం..

1). మెహర్ రమేష్ – భోళా శంకర్ (డిజాస్టర్)

ఈ ఏడాది అందరి కంటే చేదు అనుభవాన్ని మిగిల్చింది మెహర్ రమేష్ కి. ఒకప్పుడు స్టైలిష్ సినిమాలకి కేరాఫ్ అయిన మెహర్ రమేష్, పదేళ్లు ఒక్క సినిమా కూడా చేయలేకపోయాడు. తీరా మెగాస్టార్ చిరంజీవి అంతటి వారు పిలిచి మరీ భోళా శంకర్ ఆఫర్ ఇస్తే, ఏదో ఒక విధంగా వాడుకోకుండా, చెత్త స్క్రీన్ ప్లే తో సినిమా తీసి డిజాస్టర్ అందుకుని ఫెయిల్ అవడమే కాకుండా ఎన్నో రకాలుగా సోషల్ మీడియా లో ట్రోలింగ్ కి గురయ్యాడు.

- Advertisement -

2). శ్రీవాస్ – రామబాణం (డిజాస్టర్)

ఒకప్పుడు శ్రీవాస్ సినిమాలంటే మినిమం గ్యారెంటీ గా ఉండేవి. తొమ్మిదేళ్ల కిందట లౌక్యం తో బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రీవాస్ ఆ తర్వాత డిక్టేటర్, సాక్ష్యం సినిమాలతో ప్లాప్స్ అనుకోగా, కలిసొచ్చిన హీరో గోపీచంద్ తో రామబాణం సినిమాతో వచ్చి డిజాస్టర్ అనుకున్నాడు.

3). వివి వినాయక్: హిందీ ఛత్రపతి (డిజాస్టర్)

ఒకప్పుడు రాజమౌళి కి కాంపిటేటివ్ అయిన ఈ మాస్ డైరెక్టర్ చిరు రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ బ్లాక్ బస్టర్ తర్వాత హిట్ కొట్టలేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని బెల్లంకొండ శ్రీనివాస్ తో హిందీలో ఛత్రపతిని రీమేక్ చేసి డిజాస్టర్ మూటగట్టుకోవడమే గాకుండా ట్రోలర్స్ కి అడ్డంగా బుక్ అయ్యాడు.

4). ఎస్వీ కృష్ణారెడ్డి: ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు (ప్లాప్)

90స్ లో ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్ అయిన ఈ సీనియర్ డైరెక్టర్ హిట్ కొట్టి 20 ఏళ్ళ పైనే అయింది. అడపాదడపా మూడు నాలుగేళ్ళ కో సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినా రిజల్ట్ మాత్రం ప్లాపే. ఈ ఏడాది కూడా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమా డైరెక్ట్ చేసినా బోరింగ్ స్క్రీన్ ప్లే తో ప్లాప్ అయింది.

5). గుణశేఖర్ – శాకుంతలం (డిజాస్టర్)

భారీ సెట్టింగ్ లకు పెట్టింది పేరైన గుణశేఖర్ తో సినిమాలంటే ఒకప్పుడు హీరోలు క్యూ కట్టేవారు. కానీ పదిహేనేళ్లుగా ఏ సినిమా చేసినా రిజల్ట్ ఊహించిన దానికంటే దారుణంగా వచ్చేది. మధ్యలో రుద్రమ దేవి తో యావరేజ్ రిజల్ట్ ని అందుకున్నా, అక్కడితో అప్డేట్ అవ్వకుండా, సొంత నిర్మాణం లో సమంత తో శాకుంతలం సినిమా తీసి డిజాస్టర్ అనుకుని కోట్లు నష్టపోయాడు.

6). తరుణ్ భాస్కర్ – కీడా కోలా (ప్లాప్)

తరుణ్ భాస్కర్ గురించి ఈ జెనరేషన్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తక్కువ సినిమాలు చేసినా ఈ డైరెక్టర్ కి యూత్ లో క్రేజీ ఫాలోయింగ్ ఉంది. అయిదేళ్ల కింద ఈ నగరానికి ఏమైంది సినిమా తీసాక, ఈ డైరెక్టర్ యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్లగా, ఈ ఏడాది కీడా కోలా తో డైరెక్టర్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే తరుణ్ మ్యాజిక్ ఈ సారి పనిచేయలేదు. తరుణ్ భాస్కర్ క్రేజ్ వల్ల మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నా బోరింగ్ స్క్రీన్ ప్లే వల్ల సినిమా ప్లాప్ అయింది.

7). నందిని రెడ్డి – అన్ని మంచి శకునములే (ప్లాప్)

టాలీవుడ్ లో ఉన్న అతి తక్కువ మంది లేడీ డైరెక్టర్లలో నందిని రెడ్డి ఒకరు. అలా మొదలైంది బ్లాక్ బస్టర్ తర్వాత ఈమె కి పెద్దగా సక్సెస్ రాలేదు. నాలుగేళ్ళ కింద తీసిన ఓ బేబీ యావరేజ్ గా ఆడగా, ఈ ఇయర్ అన్ని మంచి శకునములే సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమా ఎప్పుడొచ్చిందో, ఎప్పుడెళ్ళిపోయిందో కూడా జనాలకి తెలీదు. అంత ఘోరంగా ప్లాప్ అయింది ఈ సినిమా.

8). జ్యోతి కృష్ణ – రూల్స్ రంజన్ (డిజాస్టర్)

ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం కొడుకైన ఈ డైరెక్టర్ కి ఇప్పటివరకు సరైన సక్సెస్ లేదు. ఆరేళ్ళ తర్వాత డైరెక్టర్ గా కిరణ్ అబ్బవరం తో రూల్స్ రంజన్ అనే సినిమాతో ఈ ఏడాది రీ ఎంట్రీ ఇవ్వగా ఎలాంటి రిజల్ట్ వచ్చిందో తెలిసిందే.

9). వక్కంతం వంశీ – ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (డిజాస్టర్)

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తో డైరెక్టర్ గా మారిన ప్రముఖ రైటర్ వక్కంతం వంశి ఆ సినిమాతో ప్లాప్ అందుకున్నా, అభిరుచి గల రచయిత గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ ఇయర్ నితిన్ తో ఎక్స్ట్రా ఆర్డీనరీ మ్యాన్ తీసి డిజాస్టర్ మూట గట్టుకుని డైరెక్టర్ గా ఫెయిల్ అవడమే గాక, మంచి రైటర్ గా తనకున్న పేరుని చెడగొట్టుకున్నాడు.

10). వంశి – టైగర్ నాగేశ్వర రావు (ప్లాప్)

ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చిన కొత్త డైరెక్టర్లలో వంశి ఒకరు. మాస్ మహారాజ్ రవితేజ తో టైగర్ నాగేశ్వరరావు అంటూ పాన్ ఇండియా సినిమాతో రాగా, బోరింగ్ స్క్రీన్ ప్లే తో సినిమా తీసి డిజాస్టర్ అందుకున్నాడు.

అయితే ఈ ఇయర్ ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్స్ లో ‘మహేష్ బాబు పచ్చిగొల్ల’ అనే డైరెక్టర్ మాత్రం సక్సెస్ అయ్యాడు. అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి హీరో,హీరోయిన్లు గా మహేష్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా డైరెక్ట్ చేయగా మూడు నెలల కింద రిలీజ్ అయిన ఆ కామెడీ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మంచి హిట్ అయింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు