Pushpa2: ‘కేశవ’ ని విడిపించడానికీ లక్షలు ఖర్చు చేస్తున్న “పుష్ప” మేకర్స్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాష్టారు సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన “పుష్ప” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండేళ్ల కింద రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో పుష్ప కు స్నేహితుడిగా కుడి భుజంగా నటించిన కేశవ అలియాస్ జగదీష్ ప్రతాప్ భండారి కూడా మచ్చా గా ఫేమ్ సంపాదించుకున్నాడు. అయితే గత వారం కింద ఈ జగదీశ్ ఓ వివాదంలో అరెస్ట్ అయ్యాడు.

పంజాగుట్టలో నివాసం ఉంటున్న జూనియర్ ఆర్టిస్ట్ అయిన ఒక మహిళ గత నెల 29వ తేదీన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న ఆ మహిళ గత నెల 27వ తేదీన ఒక వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండానే జగదీష్ ఫోటోలు తీసి ఆ తర్వాత వాటిని చూపించి ఆమెను బెదిరించాడట. మనస్థాపానికి గురైన జూనియర్ ఆర్టిస్టు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిందని పంజాగుట్ట పోలీసులు చెప్పడం జరిగింది. అయితే కేసులో తప్పించుకుని తిరుగుతున్న జగదీష్ ను డిసెంబర్ 6న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం కేశవ అలియాస్ జగదీశ్ ని విడిపించడానికి పుష్ప ప్రొడ్యూసర్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్ లక్షలు ఖర్చు చేసే ప్లాన్ లో ఉన్నారట. ప్రస్తుతం వాళ్ళు తెరకెక్కిస్తున్న “పుష్ప2” జగదీశ్ పాత్ర చాలా కీలకమట. 2024 ఆగష్టు లో రావాల్సిన ఈ సినిమాలో జగదీశ్ కి సంబంధించిన షూటింగ్ భాగం ఇంకా చాలా ఉందని, డూప్ ని పెట్టుకుని కూడా షూట్ చేయడం కుదరదని, అందుకే అతడ్ని ఎలాగైనా విడిపించమని సుకుమార్ నిర్మాతలను సంప్రదించారట.

- Advertisement -

దీనికి పోలీసులు ససేమిరా అనడంతో సుకుమార్ ఇంకా నిర్మాతలు వాళ్ళ సొంత పూఛీ పై హామీ ఇచ్చి 15 లక్షల దాకా ఖర్చు చేసి బెయిల్ పై రిలీజ్ చేయిస్తున్నారని సమాచారం. అయితే జగదీశ్ ని విడిపించేది పుష్ప సినిమాలో అతని షూటింగ్ పార్ట్ పూర్తయ్యే వరకేనని, అది కంప్లీట్ అవ్వగానే పోలీసులకి అప్పగించేస్తామని నిర్మాతలు అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తుంది. అయితే దీనిపై మేకర్స్ నుండి అనౌన్స్ మెంట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు