Pushpa: పుష్ప నటుడు కేశవ అరెస్ట్.. ఏమైందంటే..!

అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం పుష్ప.. ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఇందులో అల్లు అర్జున్ కుడి భుజంగా ఆయనకు స్నేహితుడు పాత్రలో నటించిన కేశవ అలియాస్ జగదీష్ ప్రతాప్ భండారి తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయింది. దీంతో పోలీసులు జగదీష్ ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచడం ఇప్పుడు పుష్ప అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఒక జూనియర్ ఆర్టిస్టు (మహిళ) మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బ్లాక్మెయిలింగ్ కి పాల్పడినట్లు జగదీష్ పై ఆరోపణలు ఉన్నాయి.
ఇక ఈ నటుడు వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న జూనియర్ ఆర్టిస్ట్ అయిన ఒక మహిళ గత నెల 29వ తేదీన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. మహిళ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇకపోతే ఆత్మహత్య చేసుకున్న ఆ మహిళ గత నెల 27వ తేదీన ఒక వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండానే జగదీష్ ఫోటోలు తీసి ఆ తర్వాత వాటిని చూపించి ఆమెను బెదిరించాడట. దీంతో మనస్థాపానికి గురైన జూనియర్ ఆర్టిస్టు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిందని పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు.
ఇకపోతే కేసులో తప్పించుకుని తిరుగుతున్న జగదీష్ ను డిసెంబర్ 6న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అంతేకాదు సూసైడ్ చేసుకున్న మహిళతో గతంలో జగదీష్ కి పరిచయం ఉందని పోలీసులు స్పష్టం చేశారు. జగదీష్ చేసిన పనికి అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి వాడిని అంత త్వరగా బయటకు వదలకూడదు అంటూ కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. జగదీష్ విషయానికి వస్తే.. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించి కెరియర్ మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత 2019లో మల్లేశం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. జార్జ్ రెడ్డి, పలాస 1978 సినిమాలలో కీ రోల్ పోషించి పుష్ప సినిమాతో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. మరోవైపు పుష్ప 2 సినిమాలో ఇతడి పాత్ర మరింత పవర్ఫుల్ గా ఉండనుంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇంతలోనే ఇలా వివాదాల్లో ఇరుక్కోవడం గమనార్హం.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు