Naa Saami Ranga: నాగార్జున సంక్రాంతి వదులుకోవద్దని ఫిక్స్ అయ్యాడా?

కింగ్ నాగార్జున ఫుల్ జోష్ లో ఉన్నాడు. గత కొంత కాలంగా అక్కినేని ఫ్యామిలీ కి ప్లాపులు పలకరిస్తూనే ఉన్నాయి. ఎవరు ఎలాంటి సినిమా చేసినా అవి డిజాస్టర్లు అవడమే ఆలస్యం అన్నట్టు పరిస్థితి అయిపొయింది. అయితే ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఆ ప్లాపుల పరంపర కి అడ్డుకట్ట వేసేలానే ఉంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుండగా, లేటెస్ట్ గా నాగ చైతన్య నటించిన వెబ్ సిరీస్ దూత మంచి రెస్పాన్స్ తో ఓటిటి లో దూసుకుపోతుంది.

ఇక నాగార్జున ఇప్పుడు నా సామి రంగ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా మొదలై చాలా రోజులే అయినా మధ్యలో బిగ్ బాస్ కోసం కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాడు నాగ్. కానీ గత నెలరోజులుగా నా సామి రంగ సినిమాని గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నారు. బిగ్ బాస్ కోసం ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఇచ్చి మళ్ళీ నాగార్జున సెట్స్ లో పాల్గొంటున్నాడు. అయితే నా సామి రంగ టీజర్ రిలీజ్ చేసినపుడే సంక్రాంతి కి తీసుకువస్తామని అనౌన్స్ చేయడం జరిగింది.

కానీ అప్పటికే నాలుగైదు సినిమాలు లైన్లో ఉండడంతో ఈ సినిమాని వాయిదా వేద్దామనుకున్నారు. నాగార్జున మాత్రం సంక్రాంతి సీజన్ ని వదులుకోవడానికి అస్సలు ఇష్టపడట్లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా నుండి గత రెండు వారాలుగా అప్డేట్ లు వరుసగా ఇస్తున్నారు. రీసెంట్ గా హీరోయిన్ ఇంట్రో టీజర్ ని కూడా రిలీజ్ చేయగా, లేటెస్ట్ గా ఫస్ట్ సాంగ్ ని కూడా రిలీజ్ చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారు. అయితే ఇచ్చే అప్డేట్ లో సంక్రాంతి రిలీజ్ అని మెన్షన్ చేయలేదు.

- Advertisement -

కానీ వేరే సినిమాలు గనుక పోస్టుపోన్ అయితే తమ సినిమాని ఖచ్చితంగా సంక్రాంతి రేసులో ఉంచుదామని నాగార్జున భావిస్తున్నాడని సమాచారం. అందుకే సినిమా ఎప్పుడూ వార్తల్లో ఉండేలా ఎదో ఒక అప్డేట్ ఇస్తూ జాగ్రత్త పడుతున్నారు మేకర్స్. నా సామి రంగ నిజంగా సంక్రాంతి బరిలో నిలుస్తాడా? సంక్రాంతి వచ్చేలోగా ఫ్యామిలీ స్టార్ లాగా మరేదైనా సినిమా తప్పుకుంటుందా అనేది చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు