Ooru Peru Bhairavakona : ఊరు పేరు భైరవకోన పోస్ట్ పోన్ అఫిషియల్… తగ్గేదేలే అన్న నిర్మాతలకు షాక్ ఇచ్చిన దిల్ రాజు

Ooru Peru Bhairavakona : సందీప్ కిషన్ “ఊరు పేరు భైరవకోన” మూవీ ఎట్టకేలకు పోస్ట్ పోన్ అయ్యింది. ఇన్ని రోజులూ తమ సినిమాను అనుకున్న సమయానికే రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చిన “ఊరు పేరు భైరవకోన” నిర్మాతలను మొత్తానికి వెనక్కి తగ్గేలా చేశారు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో “ఊరు పేరు భైరవకోన” మూవీ పోస్ట్ పోన్ అయింది అన్న విషయాన్ని దిల్ రాజు స్వయంగా ప్రకటించారు.

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన”. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ మూవీపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. దైవభక్తి, క్షుద్ర శక్తి, కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని రూపొందిన ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ ప్రకటించారు.

కానీ తాజాగా జరిగిన పరిణామాల మధ్య “ఊరు పేరు భైరవకోన” మూవీ పోస్ట్ పోన్ అయింది. సంక్రాంతి సినిమాల మధ్య ఏర్పడిన క్లాష్ ను పరిష్కరించడానికి దిల్ రాజు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న సినిమాలకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో జనవరి 13న రిలీజ్ కావాల్సిన మాస్ మహారాజా రవితేజ “ఈగల్” మూవీ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 9న తమ సినిమాను రిలీజ్ చేస్తామని “ఈగల్” నిర్మాతలు ప్రకటించారు.

- Advertisement -

కానీ దిల్ రాజు ఇచ్చిన సోలో రిలీజ్ డేట్ అనే హామీ కారణంగా అప్పటికే ఫిబ్రవరి 9న రిలీజ్ కు రెడీగా ఉన్న ఊరు పేరు భైరవకోన, టిల్లు స్క్వేర్ సినిమాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే టిల్లు స్క్వేర్ సినిమా అయితే వాయిదా పడింది గానీ, ఊరు పేరు భైరవకోన నిర్మాతలు మాత్రం తమను ఈ విషయమై ఎవరూ సంప్రదించలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే ముందుగా అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 9నే తమ సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక అదే రోజున యాత్ర 2, లాల్ సలాం వంటి సినిమాలు కూడా రిలీజ్ అవుతుండడంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పలువురు నిర్మాతలతో సమావేశమైన దిల్ రాజు ఎట్టకేలకు ఊరు పేరు భైరవకోన మూవీని పోస్ట్ పోన్ చేసుకునే విధంగా నిర్మాతలను ఒప్పించారు.

తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “ఊరు పేరు భైరవకోన” ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 16కి పోస్ట్ పోన్ అయ్యిందన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దిల్ రాజు మాట్లాడుతూ యాత్ర 2, లాల్ సలాం నిర్మాతలను తమ సినిమాను వాయిదా వేసుకోమని అడగ్గా వాళ్లు ఒప్పుకోలేదని అన్నారు. కానీ ఊరు పేరు భైరవకోన నిర్మాతలు మాత్రం ఛాంబర్ మాటను గౌరవించి, తమ సినిమాను వారం రోజుల తర్వాత రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారని చెప్పుకొచ్చారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు