Ayalaan : శివ కార్తికేయన్ మంచి ఛాన్స్ మిస్ అయ్యాడా?

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో నాలుగు బడా తెలుగు సినిమాలు ఉండడం వల్ల , పండక్కి రావాల్సిన డబ్బింగ్ సినిమాలు అయలాన్ , కెప్టెన్ మిల్లర్ కి థియేటర్లు దొరక్క వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలు సంక్రాంతి అయిన రెండు వారాల తరవాత తెలుగు లో రిలీజ్ కి రెడీ అవగా, వీటికి పోటీగా వేరే సినిమాలు కూడా రిలీజ్ అవలేదు.

అయితే ఈ రెండు సినిమాల్లో ధనుష్ కెప్టెన్ మిల్లర్ మాత్రమే రిలీజ్ కావడం జరిగింది. అనుకోని ఫైనాన్షియల్ కారణాల వల్ల అయలాన్ మళ్ళి వాయిదా పడింది. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని మేకర్స్ అనౌన్స్ చేసారు. అయితే కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ కి అంతగా రెస్పాన్స్ రాలేదు. ఫస్ట్ డే నే అంతంత మాత్రంగా థియేటర్ కి వెళ్లిన జనాలు వీకెండ్ లో సినిమాని పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అయలాన్ రిలీజ్ అయ్యి ఉంటె పండక్కి వచ్చిన హనుమాన్ సినిమా తరువాత ఆడియన్స్ కి రెండో బెస్ట్ ఆప్షన్ గా అయలాన్ అయి ఉండేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే అయలాన్ టాక్ పరంగా అంత గొప్పగా రాకున్నా, విజువల్స్ పరంగా, ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా కాబట్టి జనాలు ఎంతో కొంత ఖచ్చితంగా థియేటర్లకు వచ్చేవారని ఏది ఏమైనా శివ కార్తికేయన్ మంచి ఛాన్స్ మిస్ అయ్యాడని నెటిజన్లు అంటున్నారు. ఇక ఫిబ్రవరి మొదటి వారం నుండి థియేటర్లలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుండడం వల్ల అయలాన్ కి సోలో రిలీజ్ డేట్ దొరకడం ఇప్పట్లో కష్టమే.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు