Kannappa First Look : “కన్నప్ప” ఫస్ట్ లుక్… పర్ఫెక్ట్ శివరాత్రి ట్రీట్

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కన్నప్ప” ఫస్ట్ లుక్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఆ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ ను చూసిన వారు పర్ఫెక్ట్ శివరాత్రి కానుక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంతకీ “కన్నప్ప” ఫస్ట్ లుక్ విశేషాలు ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…

భారీ క్యాస్ట్ తో “కన్నప్ప”…
మంచు విష్ణు కేరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా రూపొందుతోంది “కన్నప్ప”. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, లేడీ సూపర్ స్టార్ నయనతార శివ పార్వతులుగా కనిపించబోతున్నారు. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. వీళ్లతో పాటు మోహన్ బాబు, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించబోతున్నారు. అంతేకాకుండా పాన్ ఇండియా మూవీ కాబట్టి బాలీవుడ్ లోని పలువురు అగ్ర హీరో హీరోయిన్లు కూడా “కన్నప్ప”లో భాగం కాబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్టార్ ప్లస్ లో మహాభారత సిరీస్ ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపుగా 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. పరుచూరి గోపాలకృష్ణ, సాయి మాధవ్ బుర్ర, తోట ప్రసాద్ వంటి లెజెండరీ రైటర్స్ ఈ మూవీ స్టోరీకి హంగులు అద్దాలు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు.

ఫస్ట్ లుక్ తోనే టాక్ ఆఫ్ ది టౌన్…
ఇప్పటికే ఈరోజు కన్నప్ప మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసి సినీ ప్రియులను అలర్ట్ చేశారు చిత్ర బృందం. తాజాగా శివరాత్రి కానుకగా మార్చి 8న మధ్యాహ్నం ఈ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. పరమశివుని గొప్ప భక్తుడైన “కన్నప్ప”ను చిత్రీకరించే గౌరవం ప్రత్యేకత ఇది, ఈరోజు మహాశివరాత్రి… ఇదిగో మీ కన్నప్ప అంటూ మంచు విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రేక్షకుల ముందు ఉంచారు. అందులో విష్ణు బాణం వదులుతూ ఇంటెన్సివ్ లుక్ లో కనిపిస్తున్నాడు. మంచు విష్ణు వాటర్ ఫాల్ నుంచి బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు.

- Advertisement -

“కన్నప్ప” ఫస్ట్ లుక్ ఇది కాదు..
తాజాగా రిలీజ్ అయిన కన్నప్ప ఫస్ట్ లుక్ నిజానికి ఫస్ట్ లుక్ కాదు. ఎందుకంటే ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ అంటూ ఎప్పుడో ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కన్నప్ప నుంచి గతేడాది మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో మంచు విష్ణు విల్లు ఎక్కుపెట్టినట్లుగా కనిపించినా, ఆయన మొహాన్ని మాత్రం రివీల్ చేయలేదు. తాజా పోస్టర్లో మంచు విష్ణు చేతిలో విల్లు పట్టుకుని జలపాతం నుంచి బయటకు వస్తూ కనిపించాడు. మొత్తానికి ఒక్క పోస్టులతోనే బజ్ పెంచేశారు.

కన్నప్ప షూటింగ్ అప్డేట్…
నిజ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు కన్నప్ప టీం వెల్లడించింది. ధైర్యవంతుడైన యోధుడు, శివుడి భక్తుడైన కన్నప్ప కథను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులే అవుతుంది. 2023 చివర్లో షూటింగ్ మొదలుపెట్టి, మొదటి షెడ్యూల్ ను థాయిలాండ్ లో పూర్తి చేశారు. కొన్నాళ్లు నూజిల్యాండ్ లో షూట్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప ను దృశ్య కావ్యంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పీరియాడిక్ మైథలాజికల్ మూవీకి ది బ్రేవెస్ట్ వారియర్, ది అల్టిమేట్ డివోటి అనేది ఉప శీర్షిక. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుండగా ఒక్కో అప్డేట్ తో సర్ప్రైజ్ చేస్తున్నారు చిత్ర బృందం.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు