Salman Khan : ఫ్యాన్ పై సల్లూ భాయ్ గరం గరం… ఎందుకింత పొగరు?

సెలబ్రిటీలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే సాధారణ ప్రజలు చూడడానికి ఎగబడతారు. ఇక సెల్ఫీలు, ఫోటోల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అభిమానులు ఇలా ప్రవర్తించడం అందరికీ నచ్చదు. కొంతమంది ఓపికగా అందరితో ఫోటోలకు ఫోజులిస్తారు. కానీ మరి కొంతమంది మాత్రం చిరాకు పడతారు. కొన్నిసార్లు హద్దు మీరి కొడతారు కూడా. ఇక అభిమానుల ఫోన్లు లాక్కొని ఎక్కడో పారేసిన సెలబ్రిటీల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. తాజాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా తమ అభిమాని పట్ల ఇలాగే ప్రవర్తించి షాక్ ఇచ్చాడు.

అభిమానిపై సల్మాన్ సీరియస్…
సల్మాన్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. కొన్నిసార్లు అభిమానులతో సెల్ఫీలకు సై అంటే, మరికొన్నిసార్లు సీరియస్ అయ్యి ఝలక్ ఇస్తాడు. తాజాగా మరోసారి సల్మాన్ తన అభిమానిపై అసహనం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సల్మాన్ ఖాన్ ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తూ కనిపించడంతో, అదే సమయంలో ఆ పక్కనే వెళ్తున్న ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకోవడానికి ప్రయత్నించాడు. నిజానికి అతను సల్మాన్ ఖాన్ కు చాలా దూరంగా ఉన్నాడు. కానీ అది చూశాక సల్మాన్ కు ఒక్కసారిగా కోపం తన్నుకు వచ్చింది. ఇంకేముంది సెల్ఫీలు మానేయాలి అంటూ అతని దగ్గరకు వెళ్లి మరీ తనతో వీడియో తీసుకోవడానికి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ వీడియో చూశాక నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అతనేమీ ఇబ్బంది పెట్టలేదు కదా, దూరం నుంచి సెల్ఫీ వీడియో తీసుకుంటున్న వాడిపై సల్మాన్ అలా సీరియస్ అవడం కరెక్ట్ కాదని, ఎందుకంత పొగరు? అని కామెంట్స్ చేస్తున్నారు.

సల్మాన్ సీరియస్ అవ్వడానికి ఇదే కారణమా?…

- Advertisement -

అయితే కొంతమంది మాత్రం సల్మాన్ ఖాన్ అలా సీరియస్ అవ్వడం వెనక ఒక ప్రత్యేక రీజన్ ఉందని అంటున్నారు. ఆయనకు ఇటీవల కాలంలో డెత్ థ్రెట్స్ ఎక్కువైన కారణంగానే సల్మాన్ ఇలా ప్రవర్తించారని వెనకేసుకు వస్తున్నారు. ప్రాణహాని ఉన్న నేపథ్యంలోనే సల్మాన్ మరింత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఇక ఈ హీరో అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ముగ్గురు కలిసి ట్రిపుల్ ఆర్ మూవీలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ “నాటు నాటు”కు స్టెప్పులేసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

టైగర్ 3 తో ఫ్లాప్…
రీసెంట్ గా టైగర్ 3 మూవీతో సల్మాన్ థియేటర్లలో సందడి చేశాడు. భారీ అంచనాలతో దీపావళి కానుకగా వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై తర్వాత టైగర్ 3 అంటూ సల్మాన్ చేసిన యాక్షన్ ప్రేక్షకులకు నచ్చలేదు. ఈ మూవీ కనీసం 500 కోట్ల కలెక్షన్స్ కూడా రాబట్ట లేకపోయింది. అమెజాన్ ప్రైమ్ లో జనవరి 7న సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసింది టైగర్ 3. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ తోపాటు ఇమ్రాన్ హష్మీ, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలు పోషించారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు