Gaami Movie Review: గామి మూవీ రివ్యూ

విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘గామి’. మార్చి 8 న శివరాత్రి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. విద్యాధర్ కాగిత డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి కార్తీక్ శభరీష్ నిర్మాత. వాస్తవానికి 2017 ఆ టైంలో ప్రారంభమైన సినిమా ఇది. అయితే బడ్జెట్ సమస్యల వల్ల మధ్యలో ఆగిపోయింది. దీంతో క్రౌడ్ ఫండింగ్ అనే కాన్సెప్ట్ ను ఇంప్లిమెంట్ చేసి కంప్లీట్ చేశాడు నిర్మాత. మొదట ఈ సినిమా వస్తున్నట్టు కూడా చాలా మందికి తెలీదు. కానీ మేకింగ్ వీడియోలు, గ్లింప్స్, టీజర్ వంటివి మంచి బజ్ తీసుకొచ్చాయి. ట్రైలర్ అయితే సినిమాకి బోలెడంత పబ్లిసిటీని తీసుకొచ్చింది అని చెప్పాలి. మరి ట్రైలర్ ను మ్యాచ్ చేసే విధంగా అంటే హైప్ ని మ్యాచ్ చేసే విధంగా సినిమా ఉందా? లేదా? అనే విషయాలు తెలుసుకుందాం రండి…

కథ:
శంకర్ (విశ్వక్ సేన్) ఓ అఘోరా. సాధారణంగా అఘోరాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అని అంతా అనుకుంటారు. ‘అఖండ’ సినిమాలో అఘోరాని ఓ సూపర్ హీరోగా చూపించారు. కానీ వాళ్ళకి కొన్ని బలహీనతలు ఉంటాయి. ‘గామి’ లో శంకర్ కి కూడా ఓ బలహీనత ఉంటుంది. అదేంటి అంటే.. మనిషి స్పర్శ కనుక అతనికి తగిలితే అతని శరీరంలో వింత మార్పులు చోటు చేసుకుంటాయి. అతనికి ఇలాంటి సమస్య ఎందుకు ఉంది? అతని గతం ఏంటి? ఈ సమస్యకి అతను హిమాలయాల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? మధ్యలో జాహ్నవి(చాందినీ చౌదరి) అతనికి ఏ విధంగా సాయపడింది? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:
ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. విశ్వక్‌సేన్ పాత్ర అరగంట వరకు అర్ధం కావడం కష్టం. కానీ అతనికి ఉన్న సమస్య రివీల్ అవ్వడం.. ఆ తర్వాత అతను హిమాలయాలకు వెళ్లడం.. వంటి సన్నివేశాలు వచ్చినప్పుడు అందరూ అటెన్షన్ అవుతారు. దర్శకుడు ఎంపిక చేసుకున్న పాయింట్ బాగుంది. అందుకు ఎలాంటి పిక్చరైజేషన్ కావాలో అతనికి ఓ ఐడియా ఉంది. అందుకే టేకింగ్ విషయంలో అతను ఎక్కడా కూడా తడబడలేదు. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ కూడా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ కథనం కొంచెం నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే చివరి 30 నిమిషాలు హైలెట్ గా ఉంటుంది. దర్శకుడు విద్యాధర్ కి తప్పకుండా పాస్ మార్కులు పడతాయి. ఇక నిర్మాత కార్తీక్ శభరీష్ కి సినిమా పై ఎంత ప్యాషన్ ఉంది అనేది ప్రతి ఫ్రేమ్లోనూ తెలుస్తుంది. సినిమాటోగ్రాఫర్ కి కచ్చితంగా ఎక్కువ మార్కులు పడతాయి. చివర్లో సింహం ఎపిసోడ్ వచ్చినప్పుడు.. అతను డిజైన్ చేసిన విజువల్స్ ఓ రేంజ్లో ఉంటాయి. నరేష్ కుమారన్ నేపధ్య సంగీతం కూడా హైలెట్ గా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే.. విశ్వక్ సేన్ నటన సహజంగా ఉంటుంది. ‘అఘోరా’ ఎలా ఉంటాడో తన నటనతో చాలా చక్కగా చూపించాడు విశ్వక్ సేన్. ఇలాంటి కథలు ఎంపిక చేసుకోవడానికి హీరోలకి చాలా గట్స్ ఉండాలి. విశ్వక్ ఆ విషయంలో ఇంకో మెట్టు పైకెక్కాడు అని చెప్పొచ్చు. హీరోయిన్ చాందినీ చౌదరి పాత్ర రెగ్యులర్ హీరోయిన్ల మాదిరి కాకుండా కథని ముందుకు తీసుకెళ్లే పాత్రలో హానెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఇక అభినయ మరోసారి తన మార్క్ నటనతో ఇంప్రెస్ చేసింది అని చెప్పాలి. ఉమ పాత్రలో చేసిన హారిక పెద్ద, శాంతి రావు, శ్రీధర్, వెంకట్, ఉన్నికృష్ణన్ వంటి వారు కూడా తమ తమ పాత్రలకి న్యాయం చేసారు.

ప్లస్ పాయింట్స్ : 

విశ్వక్ సేన్
కథ
డైరెక్షన్
విజువల్స్
నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

స్లోగా సాగడం
సెకండ్ హాఫ్

మొత్తంగా ‘గామి’ ట్రైలర్ తో నెలకొల్పిన అంచనాలను పూర్తిగా మ్యాచ్ చేయలేకపోయినా.. డిఫెరెంట్ సినిమాలు ఇష్టపడేవారిని ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.

రేటింగ్ : 2.5/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు