Sreeleela : ఆఫర్లన్నీ వదులుకుంటున్న శ్రీలీల… ఎందుకంటే?

టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల రెస్ట్ లేకుండా పని చేసినప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగా మిగిలింది. రీసెంట్ గా వచ్చిన ఆమె సినిమాలన్నీ డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీ సినిమాల విషయంలో ఆలోచనలో పడింది. అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ అమ్మడు తన దగ్గరకు వచ్చిన క్రేజీ ఆఫర్లన్ని వదులుకుంటుందట. మరి ఇంతకీ శ్రీలీల ఆ ఆఫర్లను ఎందుకు వదులుకుంది? అనే విషయంలోకి వెళ్తే…

బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్…
టాలీవుడ్ లో గత ఏడాది శ్రీలీల హవా బాగానే నడిచింది. ఒకే ఏడాది అరడజనుకు పైగా సినిమాలను ప్రకటించి సెన్సేషన్ గా మారింది. పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజతో కలిసి శ్రీలీల వేసిన మాస్ స్టెప్పులకు యూత్ అంతా ఫిదా అయిపోయారు. ఆమె డాన్స్ టాలెంట్ ను తెగ పొగిడేసారు. దీంతో వరుసగా ఆఫర్లు ఈ బ్యూటీ ఇంటి తలుపు తట్టాయి. కానీ ఆ రేంజ్ లో డాన్స్ రావడమే ఆమెకు శాపమైనట్టుగా ఉంది.

హీరోయిన్ కాదు డ్యాన్సింగ్ డాల్…
ఆమె నెక్స్ట్ సినిమాలన్నీ శ్రీలీల అంటే కేవలం ఎనర్జిటిక్ డాన్సర్ అన్న అభిప్రాయాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. ఒక్క భగవంత్ కేసరి తప్ప. వరుస సినిమాల్లో నటించినప్పటికీ తన పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో అదే విధంగా వరుస డిజాస్టర్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇంపార్టెన్స్ లేని రోల్స్ చేసి తన ఇమేజ్ ని తానే డ్యామేజ్ చేసుకుంది. చివరగా “గుంటూరు కారం” మూవీపై స్ట్రాంగ్ గా హోప్స్ పెట్టుకుంది. మూవీలో ఈమె పాత్ర సంగతి పక్కన పెడితే గుంటూరు కారం నెగిటివ్ టాక్ తో జస్ట్ యావరేజ్ గా నిలిచింది. అది కూడా మొత్తం మహేష్ బాబు ఖాతాలోనే పడిపోయింది. దీంతో ఆ మూవీ వాళ్ళ శ్రీలీలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అందుకే అడ్డు అదుపు లేకుండా దూసుకుపోతున్న కెరీర్ కు స్పీడ్ బ్రేక్ వేసి, ఆలోచనలో పడింది శ్రీ లీల.

- Advertisement -

క్రేజీ ఆఫర్స్ కు నో…
ఈ నేపథ్యంలోనే తన దగ్గరకు వచ్చిన క్రేజీ ఆఫర్స్ కు నో చెప్పేసిందట శ్రీలీల. కేవలం డాన్స్, గ్లామర్ రోల్స్ కాకుండా కంటెంట్ కు ప్రాధాన్యతను ఇవ్వాలని, తన యాక్టింగ్ టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే రోల్స్ అయితేనే చేయాలని డిసైడ్ అయిందట. అందుకే రీసెంట్ గా తన దగ్గరకు వచ్చిన ఇద్దరు తెలుగు స్టార్ హీరోల సినిమాలను రిజెక్ట్ చేసిందని టాక్ నడుస్తోంది. ఓ బిగ్ ప్రాజెక్ట్ లో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలని సంప్రదిస్తే, మొహమాటం లేకుండా నో చెప్పేసిందట. నటిగా సత్తా చాటాలని వెయిట్ చేస్తున్న ఇలాంటి టైంలో ఐటమ్ నెంబర్లు చేయడం వల్ల ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో అలా చేసిందట. ప్రస్తుతం శ్రీలీల చేతిలో విజయ్ దేవరకొండ మూవీ మాత్రమే ఉంది. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయలేదు ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తన పొరపాటును గుర్తించి డామేజ్ కంట్రోల్ చర్యలు మొదలుపెట్టింది శ్రీలీల. ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోందన్న మాట.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు