Kantara -2: కాంతారా -2 లో నందమూరి హీరో.. సెట్ అయితే అరాచకమే..!!

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎటువంటి అంచనాలు లేకుండా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన చిత్రాలలో కాంతారా చిత్రం కూడా ఒకటి.. ఈ సినిమా విడుదలైనప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.. కానీ ఎప్పుడైతే కన్నడ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుందో.. అప్పట్నుంచి ఈ సినిమా క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.. అలా కన్నడ లో విడుదలైన వారం తర్వాత ఇతర భాషలలో విడుదలై ఒక సంచలనం సృష్టించింది కాంతారా మూవీ.. ముఖ్యంగా ఈ సినిమాతో డైరెక్టర్ గా, హీరోగా రిషబ్ శెట్టి హార్డ్ వర్కింగ్ కి అందరూ ఫిదా అయిపోయారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపించింది.

కాంతారా ప్రీక్వెల్..
ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్-2 త్వరలోనే రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.. అసలు కాంతార కథలోని కీలకమైన సన్నివేశాలను మరింత ఫాంటసీ నేపథ్యంలో ప్రజెంట్ చేయడానికి సిద్ధమవుతున్నారు డైరెక్టర్ కం హీరో రిషబ్ శెట్టి.. ఆ మధ్య అనౌన్స్మెంట్ పోస్టర్తో కూడా భారీగానే హైప్ క్రియేట్ చేశారు.. దీంతో ఈ సినిమా ప్రీక్వెల్ కూడా అంతకుమించి అనేలా ఉండబోతోందని అభిమానులైతే ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

కాంతారాలో టాప్ సెలబ్రిటీస్..
అయితే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల కోసం స్పెషల్ రోల్స్ ను కూడా ఆశ్చర్యపరిచే విధంగా ప్లాన్ చేస్తున్నారు రిషబ్ శెట్టి.. దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంతో కాంతారా సినిమాని మిగతా భాషలలో కూడా విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తూ ఇతర భాషలలోని నటీనటులను సెలెక్ట్ చేసుకోవాలని చూస్తున్నారట.. అలా తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఒక పవర్ఫుల్ హీరోని తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ హీరో ఎవరో కాదు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవల కర్ణాటకకు వెళ్లిన ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని అలాగే రిషబ్ శెట్టిని కూడా కలిశారట.

- Advertisement -

కాంతారా ప్రీక్వెల్ లో ఎన్టీఆర్..
కాంతారా అలాగే ప్రశాంత్ నీల్ తో చేసే ప్రాజెక్టుల కోసమే ఎన్టీఆర్ కర్ణాటకకు వెళ్లారని.. అలాగే కాంతారా ప్రాజెక్టులో భాగమయ్యేందుకు కాస్త మొగ్గు చూపుతున్నారని వార్తలు కన్నడ మీడియా నుంచి వినిపిస్తున్నాయి.. గతంలో కూడా ఖచ్చితంగా ఒక టాలీవుడ్ హీరో అయితే కాంతారా ప్రీక్వెల్ లో కనిపించబోతారని టాక్ వినిపించింది.. దీన్ని బట్టి చూస్తే ఒకవేళ ఎన్టీఆర్ ఇందులో ఏదైనా పాత్రను ఓకే చేశారంటే ఈ సినిమాకు మరింత ప్లస్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే కచ్చితంగా అరాచకమే అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ సినిమాలు..
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో ఉన్నారు.. అలాగే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఈ చిత్రం వచ్చే ఏడాది మొదలు కాబోతోంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు