Kanthara chapter 1 : వామ్మో కంతార.. పుష్ప తోనే పోటీ పడుతుందిగా…!

ఇది వ‌ర‌కు కేవ‌లం తెలుగు సినిమాలు తెలుగు సినిమాల‌తోనే పోటీ ప‌డేవి…హిందీ సినిమాలు హిందీ సినిమాలు హిందీ సినిమాల‌తోనే పోటీ ప‌డేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏ భాష‌లో తెర‌కెక్కిన సినిమా అయినా పాన్ ఇండియాలో అన్ని భాష‌ల చిత్రాల‌తో పోటీ ప‌డుతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల మ‌ధ్య ఓ రేంజ్లో పోటీ క‌నిపిస్తోంది. తాజాగా నెట్టింట రెండు పాన్ ఇండియా సినిమాల మ‌ధ్య మొద‌ల‌య్యింది. అందులో ఒక‌టి క‌న్న‌డ సినిమా కాగా మ‌రొక‌టి టాలీవుడ్ సినిమా.

క‌న్న‌డ‌నాట విడుద‌లై కాంతార సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ ఈ సినిమాకు కేజీఎఫ్ ను మించిన క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. దాంతో ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల చేశారు. కాగా అన్ని భాష‌ల్లోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు చాప్ట‌ర్ 1 తెర‌కెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుండి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్ కూడా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. అయితే ఈ సినిమాను మూవీ ల‌వ‌ర్స్ పుష్ప‌తో లింక్ చేయ‌డం విశేషం. పుష్ఫ సినిమాకు సీక్వెల్ గా పుష్ప ది రూల్ పేరుతో పార్ట్-2 తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ సినిమా నుండి పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌గా అల్లు అర్జున్ గెట‌ప్ కాంతార‌లో క్యారెక్ట‌ర్ గెట‌ప్ ను పోలి డిఫరెంట్‌గా ఉంది. దాంతో ఆనాటి నుండి కాంతారా చాప్టర్ 1తో పుష్ప పార్ట్‌2 మధ్య పోటీ మొదలయ్యింది. ఇక తాజాగా కాంతార చాప్టర్1 గ్లింప్స్ విడుదలవ్వడంతో అభిమానులు కాంతార కు సపోర్ట్ చేసేవాళ్లు లైక్ చేయండి….పుష్ప పార్ట్2 ‌కు సపోర్ట్ చేసేవాళ్లు కామెండ్ చేయండి అంటూ పోల్ నిర్వహించారు. ఇక ఈ పోల్‌లో తెలుగు ప్రేక్షకులు పుష్ప సినిమాకు సపోర్ట్ చేస్తుంటే…కన్నడ ప్రేక్షకులు కాంతారకు సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ రెండు చిత్రాలలో ఏ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు