Bollywood to Tollywood: బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఆలయాలు ఉన్న సెలబ్రిటీలు వీళ్లే..!

భాషతో సంబంధం లేకుండా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలామంది సెలబ్రిటీలు తమ చిత్రాలతో అసాధారణ నటనను కనపరిచి.. పెద్ద స్క్రీన్లని శాసిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సెలబ్రిటీల అభిమానులు వారిపై తమ అభిమానాన్ని చాటుకోవడానికి ఎప్పుడూ కూడా ముందు ఉంటారు. ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్ నుంచి సమంతా రుతు ప్రభా వరకు ఇలా తమ అభిమాన సెలబ్రిటీ ల కోసం అభిమానులు విగ్రహాలను నిర్మించి ఆలయాలు ఏర్పాటు చేశారు. అలా వారిలో ఆలయాలు ఉన్న సెలెబ్రిటీల గురించి ఇప్పుడు చూద్దాం.

అమితాబ్ బచ్చన్:
బాలీవుడ్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ తన స్వభావం తో ఎంతోమంది హృదయాలని గెలుచుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి కోల్కతాలో ఆయన అభిమానులు ఆయనకు గుడి కూడా నిర్మించడం జరిగింది.

సమంత:
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ మరింత పాపులారిటీ దక్కించుకున్న సమంత తన నవ్వుతో.. అందంతో.. నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తన పై అభిమానం పెంచుకున్న అభిమానులు ఆమె కోసం ఏకంగా ఆలయాన్ని నిర్మించారు. అలా తన 36వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఆమె విగ్రహంతో ఆలయాన్ని ఒక అభిమాని నిర్మించడం జరిగింది.

- Advertisement -

రజినీకాంత్:
బస్ కండక్టర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత సూపర్ స్టార్ హీరోగా సినీ పరిశ్రమనే ఏలుతున్న రజినీకాంత్ తన నటన నైపుణ్యానికి ప్రసిద్ధి చెందారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఆయనను ప్రేమిస్తారని చెప్పాలి .ఇకపోతే కర్ణాటకలోని కోలార్ లో ఉన్న కోటి లింగేశ్వర ఆలయంలో ఆయన అభిమానులు ఆయన పేరు మీద ఆలయాన్ని నిర్మించారు.

నిధి అగర్వాల్:
దక్షిణ భారత సినీ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్ మొదటి తమిళ్ పరిశ్రమలో అడుగు పెట్టింది. తన అందంతో , నటనతో ఆకట్టుకున్న ఈమెకు అభిమానులు చెన్నైలో ఆలయాన్ని నిర్మించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు.

సోనూ సూద్:
బాలీవుడ్ నటుడు అయినా సహాయ స్వభావానికి మంచి పేరు దక్కించుకున్నారు. తన మానవతావాదంతో అందరి మన్ననలు పొందారు. అందుకే సిద్దిపేట జిల్లా దుబ్బ తండా గ్రామంలో ఆయన అభిమానులు గుడి కట్టినట్లు సమాచారం.

వీరే కాకుండా ఖుష్బూ , హన్సిక తదితర నటీమణులకు కూడా గుడి కట్టించి అభిమానులు ఆరాధిస్తున్నారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు