Thamannah: మీడియా పై మండిపడ్డ తమన్నా బాయ్ ఫ్రెండ్.. మీరెవరూ అంటూ..?

టాలీవుడ్ హీరోయిన్ తమన్నా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. విజయ్ వర్మ నాని నటించిన ఎంసీఏ సినిమాతో తెలుగు తెరకు విలన్ గా పరిచయమయ్యారు.. అప్పుడు పెద్దగా పాపులారిటీ రాకపోయినా తమన్నా బాయ్ ఫ్రెండ్ గా మరింత క్రేజ్ ని అందుకున్నారు. ఇక అప్పటినుంచి విజయ్ వర్మ పేరు అటు బాలీవుడ్ , కోలీవుడ్, టాలీవుడ్ లో చాలా వైరల్ గా మారుతూనే ఉంది. ఎలాంటి విషయాలలోనైనా సరే విజయవర్మ ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటారు.

ఇప్పుడు తాజాగా తమన్నాతో పెళ్లిపై కూడా అంతే ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తమన్నా విజయ్ వర్మ త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయం పైన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ వర్మను యాంకర్ అడగడం జరిగింది.. తమన్నాను ఎప్పుడు వివాహం చేసుకుంటారని ప్రశ్నించగా.. ఈ విషయం పైన డైరెక్ట్ గా విజయ్ వర్మ స్పందిస్తూ.. ఈ విషయాన్ని ఇంకా తమ కుటుంబంతో షేర్ చేసుకోలేదని ఈ విషయంపై ఇప్పుడే సమాధానం ఇవ్వలేమంటూ తెలియజేశారు.

గతంలో కూడా తమన్న తమ పెళ్లిపై స్పందించడం జరిగింది. ఇంకా ఈ విషయాన్ని సైతం తన తల్లికే చెప్పలేదని మీడియా వారికి ఎందుకు సమాధానం చెప్పాలని ఫైర్ కావడం జరిగింది. ప్రస్తుతం తామిద్దరము కెరియర్లో బిజీగా ఉన్నామని పెళ్లి గురించి ఇప్పట్లో ఆలోచన లేదని కూడా తెలియజేయడం జరిగింది.. దీన్ని బట్టి చూస్తే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అనే వార్తలు కేవలం రూమర్స్ గానే వినిపిస్తున్నాయని చెప్పవచ్చు. అలా గతంలో తమన్నా స్పందించగా ఇప్పుడు విజయ్ వర్మ కూడా మీడియాకు చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా ఘాటుగానే సమాధానాన్ని ఇచ్చారు.

- Advertisement -

అయితే ప్రస్తుతానికి బాలీవుడ్లో పలు రకాల వెబ్ సిరీస్లలో సినిమాలలో నటిస్తూ ఉన్నారు. కానీ బాలీవుడ్లో తరచూ వీరి గురించి ఏదో ఒక విషయం వినిపిస్తూనే ఉంటుంది. పెళ్లికి సంబంధించి ఇద్దరు కూడా ప్రిపరేషన్ లో ఉన్నారని, తెరవెనుక పలు రకాల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని కథనాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. మరి ఇందుకు సంబంధించి ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది. వచ్చే ఏడాదైనా వీరి వివాహాన్ని ప్రకటిస్తారేమో చూడాలి మరి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు