Tamannaah: విజయ్ వర్మ కంటే ఆ హీరోతో ఎక్కువ క్లోజ్ గా మూవ్ అవుతున్న తమన్నా..!

Tamannaah

సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకొని సక్సెస్ఫుల్ హీరోయిన్ గా హవా చాటుతున్న తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు యువత గుండెల్లో చిచ్చు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, సౌత్, నార్త్ సినిమాలతో తెగ బిజీగా ఉంది. ఇక తమన్నా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు వారు స్వయంగా తెలిపిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఇటీవల లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ లో నటించారు.

ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే వీరి బంధం డేటింగ్ వరకే అని మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల తమన్నా తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటున్న విజయ్ వర్మ కంటే మరో హీరోతో ఎక్కువగా క్లోజ్ గా మూవ్ అవుతుందట.

ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. విజయ్ వర్మను పక్కన పెట్టేసి మరి ఆ హీరోతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుందట తమన్నా. ఈ విషయం తెలిసిన విజయ్ వర్మ కూడా సైలెంట్ గా ఉంటున్నాడట. దీనంతటికీ కారణం విజయ్ కి తమన్న పై ఉన్న నమ్మకమేనని చెప్పుకుంటున్నారు. అయితే ఈ నమ్మకాన్ని ప్లస్ గా మార్చుకున్న తమన్నా ఏకంగా వేరే హీరోతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ హీరో ఎవరని వెతికే పనిలోపడ్డారు నెటిజెన్లు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు