Tamannah: మిల్కీ బ్యూటీ కాదు… లస్ట్ బ్యూటీనే కనిపిస్తుంది..!

మిల్కీ బ్యూటీ అన్న పేరు వినగానే పాలరాతి శిల్పం లాంటి అందమైన తమన్నా గుర్తొస్తుంది. ఆవారా, 100% లవ్, బద్రీనాధ్, ఎందుకంటే ప్రేమంట, రెబల్, రచ్చ ఇలా చెప్పుకుంటే పోతే తమన్నా చేసిన ప్రతి సినిమాలో హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా  తమన్నా అందంతోనే కాకుండా డ్యాన్స్ తో ఇరగదీసి తన మార్క్ వేసేది. అలా కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకున్న మిల్కీ బ్యూటీ కేవలం కమర్షియాల్ సినిమాలకు మాత్రమే పరిమితమవ్వటం, సరైన హిట్స్ లేకపోవటం వల్ల కొంత కాలం తర్వాత అవకాశాలు సన్నగిల్లి ఐటమ్ సాంగ్స్ చేసే స్థాయికి చేరింది.

వెండితెరపై అవకాశాలు లేకపోవటంతో ఇటీవలే ఓటీటీకి షిఫ్ట్ అయ్యింది తమన్నా. మిల్కీ బ్యూటీ నటించిన జీ ఖర్దా, లస్ట్ స్టోరీస్ వంటి వెబ్ సిరీస్ లు ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. సినిమాల్లో ఉన్నంతవరకు లిప్ లాక్ వంటి బోల్డ్ సీన్స్ కి దూరంగా ఉన్న తమన్నా ఓటీటీకి వచ్చాక లిమిటేషన్స్ కి గుడ్ బై చెప్పి బోల్డ్ సీన్స్, లిప్ లాక్స్ తో రెచ్చిపోవడంతో నెట్టింట ఆ సీన్స్ వైరల్ అయ్యాయి.

ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం తమన్నాకి మిల్కీ బ్యూటీ అన్న ట్యాగ్ చెరిగిపోయి, లస్ట్ బ్యూటీ అన్న ట్యాగ్ వచ్చేలా ఉంది. ఇటీవల రిలీజ్ అయిన భోళాశంకర్ సినిమాలోని మిల్కీ బ్యూటీ సాంగ్ కి వస్తున్న కామెంట్స్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. కళ్ళు తిప్పుకోనివ్వని అందంతో అలరించిన తమన్నా ఇప్పుడు ఓటీటీలో రెచ్చిపోయిన తీరుకి ఆడియెన్స్ ఫ్యూజులు ఎగిరిపోయాయనే చెప్పాలి.

- Advertisement -

భోళాశంకర్ సినిమాలో తమన్నా క్యారెక్టర్ ఫ్యామిలీ టైప్ క్యారెక్టర్ అయినప్పటికీ లస్ట్ స్టోరీస్ ఎఫెక్ట్ వల్ల నెటిజన్స్ తమన్నాలో మిల్కీ బ్యూటీని మర్చిపోయి లస్ట్ బ్యూటీనే గుర్తు చేసుకుంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో బోల్డ్ సీన్స్ తో రెచ్చిపోయిన తమన్నా సీనియర్ హీరోలకు ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ గా మారిన నేపథ్యంలో తిరిగి మిల్కీ బ్యూటీ ట్యాగ్ ని సొంతం చేసుకుంటుందా లేక లస్ట్ బ్యూటిగానే మిగిలిపోతుందా అనేది వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు